Home Filmy Adda పెళ్లికి ఒక్కరోజు ముందు ఎంతగానో ఇష్టపడిన అబ్బాయి వేరే అమ్మాయితో పారిపోతే..? ఈ సినిమా చూశారా..?

పెళ్లికి ఒక్కరోజు ముందు ఎంతగానో ఇష్టపడిన అబ్బాయి వేరే అమ్మాయితో పారిపోతే..? ఈ సినిమా చూశారా..?

by Sainath Gopi

Ads

ఒక సినిమా అంటే ఫైటింగ్ సీన్లు, భారీ బడ్జెట్ పాటలు ఉండాల్సిన అవసరం లేదు. మామూలు కథని ఆసక్తికరంగా చూపించినా కూడా ప్రేక్షకులు చూస్తారు. అలాంటి ఒక కథతో వచ్చిన సినిమా ఇదే. ఈ సినిమా పేరు, అర్చన 31 నాట్ అవుట్. ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకి అఖిల్ అనిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక ఊరిలో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది అర్చన (ఐశ్వర్య లక్ష్మి). ఎన్నో పెళ్లి సంబంధాలు చూసిన తర్వాత 31వ పెళ్లి సంబంధం అర్చనకి నచ్చుతుంది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి.

Video Advertisement

movie about a woman

పెళ్లికి ముందు రోజు పెళ్ళికొడుకు గతంలో అతనిని ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతున్నట్టు చెప్తాడు. కానీ ఈ విషయాన్ని అర్చన తన ఇంట్లో వాళ్లకు చెప్పదు. పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరికీ కూడా ఈ విషయం తెలియదు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. ఒకే ఒక్క రోజులో సినిమా కథ చాలా వరకు మొత్తం నడుస్తుంది. అయినా కూడా తర్వాత ఏమవుతుంది అని ఆసక్తితో సినిమా నడిపించారు. 2022 లో వచ్చిన ఈ సినిమా మలయాళం భాషలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.

 movie about a woman

ఈ సినిమాలో డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అందులోనూ సినిమా చివరిలో హీరోయిన్ తీసుకునే నిర్ణయం, అప్పుడు హీరోయిన్ ఇచ్చే స్పీచ్ చాలా బాగా రాశారు. పెళ్లి అనే ఒక విషయం ఒక అమ్మాయి జీవితాన్ని నిర్ణయించదు అనే విషయాన్ని ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. పెళ్లికి ముందు రోజు పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి పారిపోతే, ఈ విషయాన్ని ఆ అమ్మాయి ఎంత జాగ్రత్తగా పరిష్కరించింది అనేదాన్ని ఈ సినిమాలో చూపించారు. సినిమాలో చాలా తక్కువ మంది నటీనటులు ఉంటారు. పెద్ద పెద్ద సెట్టింగ్స్ కూడా ఉండవు. ఒక ఊరిలో ఇంట్లో సినిమా నడుస్తుంది. ఆడపిల్లలు ఈ సమాజంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారో చాలా సున్నితంగా ఇందులో చూపించారు. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చూపించారు.

ALSO READ : “పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు..!


End of Article

You may also like