బాహుబలి డైలాగ్ రైటర్ దర్శకత్వం, జగపతిబాబు మెయిన్ రోల్..! ఈ సినిమా చూశారా..?

బాహుబలి డైలాగ్ రైటర్ దర్శకత్వం, జగపతిబాబు మెయిన్ రోల్..! ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

జగపతి బాబు ‘లెజెండ్’ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. టాలీవుడ్ తో పాటుగా తమిళ, హిందీ, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టుల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అయితే జగపతి బాబు మెయిన్ రోల్ లో రూపొందిన రుద్రంగి నేడు రిలీజ్ అయ్యింది. ఆ  సినిమా ఎలా ఉందో చూద్దాం..

Video Advertisement

  • సినిమా : రుద్రంగి
  • నటీనటులు : జగపతి బాబు,విమలా రామన్, మమతా మోహన్ దాస్,ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు తదితరులు
  • నిర్మాత : ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్
  • దర్శకత్వం : అజయ్ సామ్రాట్
  • సినిమాటోగ్రఫీ : ఎన్.సుధాకర్ రెడ్డి
  • సంగీతం : నాఫల్ రాజా
  • విడుదల తేదీ : జులై 7, 2023.
    rudrangi-movie-review

స్టోరీ:

మల్లేష్( ఆశిష్ గాంధీ), గానవి లక్ష్మణ్(రుద్రంగి) బావ మరదలు. వీరికి చిన్నప్పుడే వివాహం అవుతుంది. తల్లిదండ్రులు లేని ఇద్దరినీ వాళ్ళ తాత పెంచుతాడు. అయితే ఆ ఊరిలో ఉండే ఒక దొర (కాలకేయ ప్రభాకర్) మల్లేష్ తాతని చంపుతాడు. ఆ సమయంలో ఇద్దరు దూరమవుతారు. అదే ఊరికి ఉన్న మరో దొర భీమ్ రావు దేశ్ ముఖ్ (జగపతి బాబు). భీమ్ రావు పై కాలకేయ ప్రభాకర్ అనుచరులు దాడి చేయగా, మల్లేష్ అతన్ని రక్షిస్తాడు. దాంతో భీమ్ రావు మల్లేష్ చేరదీస్తాడు. ఇద్దరికీ శత్రువుగా మారిన కాలకేయ ప్రభాకర్ ను చంపేస్తారు.

భీమ్ రావు జనాలను పీడిస్తూ, ఆ ఊరిలోని అమ్మాయిలపై అకృత్యాలను చేస్తుంటాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ అకృత్యాలను చేస్తుంటాడు. అతని పెద్ద భార్య మీరా బాయ్ (విమలా రామన్), రెండవ భార్య జ్వాలా భాయ్ (మమతా మోహన్ దాస్)ని కూడా బాధ పెడుతుంటాడు. ఈ క్రమంలో అతని చూపు రుద్రంగి పై పడుతుంది. అప్పటి నుండి మల్లేష్, భీమ్ రావు శత్రువులుగా మారుతారు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మల్లేష్ రుద్రంగిని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైంది అనేది మిగతా కథరివ్యూ:

‘బహుబలి’కి డైలాగ్ రచయితగా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఒకప్పుప్పటి కాలంలో దొరలు పెత్తనం చెలాయిస్తూ ప్రజలను అణగదొక్కడం లాంటివి ఈ మూవీలో సహజంగా చూపించాడు. ప్రధామర్ధాన్ని వేగంగా నడిపించిన దర్శకుడు, సెకండాఫ్ మొదట్లో బోర్ అనిపించేలా తీశాడు. అయితే మూవీ క్లైమాక్స్ ను మళ్ళీ ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు.
భీమ్‌ రావు క్యారెక్టర్ లో జగపతిబాబును తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేనంత అద్భుతంగా నటించారు. భీమ్‌ రావు క్యారెక్టర్ కి ప్రాణం పోశారు. మల్లేష్‌ గా ఆశిష్‌ గాంధీ మెప్పించారు. జ్వాలాబాయ్‌ పాత్రలో మమతా మోహన్‌దాస్‌ యాక్టింగ్ బాగుంది. ఆమె నటించిన సన్నివేశాలలో మమతా మోహన్‌దాస్‌ డామినేషనే కనిపిస్తుంది.
భీమ్‌ రావు పెద్ద భార్య మీరాబాయ్‌ క్యారెక్టర్ లో విమలా రామన్‌ ఆకట్టుకుంటుంది. టైటిల్ పాత్రలో నటించిన గనవి లక్ష్మణ్‌ ఈ మూవీకి పెద్ద అసెట్‌ గా నిలిచింది. కనిపించేది కాసేపే అయినా ఇంపాక్ట్ ని చూపించింది. కరుణం పాత్రలో ఆర్‌ ఎస్‌ నందా నవ్వులు పూయించాడు. మిగిలినవారు తమ పాత్రలు మేరకు నటించారు.
టెక్నికల్ విషయానికి వస్తే నాఫల్ రాజా అందించిన పాటలు అంతగా రిజిస్టర్ కావు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫి ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు కథకి తగినట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • జగపతిబాబు నటన,
  • మమతా మోహన్‌దాస్‌ నటన,
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్లు:

  •  సెకండాఫ్‌
  • కనెక్ట్ కానీ ఎమోషన్స్
  • కొన్ని బోరింగ్ సీన్స్

రేటింగ్:

2.5/5

ట్యాగ్ లైన్ :

తెలంగాణ దొరల బ్యాక్ డ్రాప్ ని మరో కోణంలో చూపించిన మూవీ. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఒకసారి చూడదగ్గ మూవీ.

watch trailer :


End of Article

You may also like