విద్యార్థుల కష్టాలని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు..! ఈ సినిమా చూశారా..?

విద్యార్థుల కష్టాలని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు..! ఈ సినిమా చూశారా..?

by Mounika Singaluri

Ads

మున్నాభాయ్ ఎంబిబిఎస్, పీకే,త్రీ ఇడియట్స్ వంటి ప్రసిద్ధ సినిమాల నిర్మాత 1942 ఏ లవ్ స్టోరీ, పరింద, మిషన్ కాశ్మీర్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు విధూ వినోద్ చోప్రా  తాజాగా నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం 12th ఫెయిల్. విద్యార్థులను టార్గెట్ చేస్తూ తీసిన  చిత్రం ఇటీవల రిలీజై మంచి పేరు తెచ్చుకుంది. చిన్న సినిమాల హీరో విక్రాంత్ మాస్సే, మేధాశంకర్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించారు. విద్యార్థులకి ఈ  ద్వారా చూపించిన చదువుల ప్రపంచం ఎలా ఉందో చూద్దాం.

Video Advertisement

1997లో మనోజ్ శర్మ (విక్రాంత్ మాస్సే), మధ్యప్రదేశ్ లోని చంబల్ లోయ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. నిజాయితీగల తండ్రి రాంవీర్ శర్మ (హరీష్ ఖన్న), ప్రేమగల తల్లి పుష్ప (గీత అగర్వాల్) సోదరుడు కమలేష్ (రాహుల్ కుమార్) సోదరి రజిని (ఫెర్రీ ఛాబ్రా)అమ్మమ్మ సరిత జోషిలతో కలిసి వ్యవసాయం చేసుకునే దిగుమధ్య తరగతి కుటుంబం అతడిది.

 మనోజ్ కి ఐపీఎస్ అధికారి అవ్వాలని కలలుంటాయి. కానీ 12వ తరగతిలో ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే బోర్డు పరీక్షల్లో ఉపాధ్యాయులు మాస్ కాపీయింగ్ చేయించకుండా డి.ఎస్.పి దుష్యంత సింగ్ (ప్రియాంషు ఛటర్జీ) అడ్డుకుంటాడు. నువ్వు ఐపీఎస్ కావాలంటే ఎలాంటి అర్థమార్గాలు తొక్కకూడదని డిఎస్పి మందలించాడు కూడా.తర్వాతి సంవత్సరం థర్డ్ క్లాస్ లో పాస్ అవుతాడు. ఇక అమ్మమ్మ పొదుపు చేసిన పెన్షన్ డబ్బులు తీసుకుని సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి ఢిల్లీ వెళ్తాడు. అతనికి పట్టుదల ఉంటుంది కానీ, అందుకు తగ్గ అధ్యయన నైపుణ్యాలు ఉండవు.

పైగా హిందీ మీడియం చదివాడు. ఉన్నత చదువులు పై కనీస అవగాహన కూడా లేదు. యుపిఎస్సి, ఐపీఎస్ ప్రొఫైల్ లాంటివి ఉంటాయని కూడా తెలియదు. పైగా ఆర్థిక అసమానతలు , కులతత్వం ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువు (అంశుమాన్ పుష్కర్)స్నేహితులతో పాటు స్నేహితురాలు శ్రద్ధ జోషి (మేధా శంకర్ )ల సహాయంతో తన ఐపిఎస్ కలనీ ఎలా నెరవేర్చుకున్నాడు అన్నదే మిగతా కథ.


కథా విషయానికొస్తే ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధ జోషీలా నిజ జీవితవృత్తాంతంతో ప్రేరణ పొందిన రాసిన కథ ఇది. నవల రచయిత అనురాగ్ పాటక్ బందిపోట్లకు పేరుబడ్డ చాలా వెనుకబడిన చంబల్ గ్రామం నుంచి ఒక హిందీ మీడియం సగటు విద్యార్థి పోలీసు శాఖలోని ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం ఈ కథ చెబుతుంది. 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించడంలో విఫలమైన మనోజ్ పై జీవితం, సమాజం, ప్రేమ, స్నేహం ఎలాంటి సవాళ్లు విసిరాయి అన్నది పూర్తి సినిమా చూసి తెలుసుకోవాలి.

ఇందులో నీతి ఏంటంటే ఆర్థిక అసమానతలు, అవినీతి కుల రాజకీయాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ మెరిటోక్రాటిక్ ద్వారా యూపీఎస్సీ లో విజయం సాధించవచ్చు అని చెప్పడం.ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఇప్పటికీ చాలా పక్షపాతాలు అలా పాతుకుపోయి ఉన్నాయని, ఇవి మనోజ్ లాంటి కుర్రాల జీవితాన్ని కష్టతరం చేస్తున్నాయని స్పష్టం చేశారు.నిజానికి విద్య గురించి ఇది స్పోర్ట్స్ సినిమా లాంటి థ్రిల్లింగ్ కథ. స్పోర్ట్స్ సినిమాలో మెడల్ కొట్టడానికి గెలుపోటములు, సస్పెన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో కథ ఎలా సాగుతుందో ఎడ్యుకేషన్ సినిమాకి వర్తింపజేసి రూపకల్పన చేయడం ఇక్కడ ప్రత్యేకత.ఇకనట్టి నటుల విషయానికి వస్తే మనోజ్ శర్మ పాత్రలో విక్రాంత్ మాస్సే నూరు శాతం తన ఎఫర్ట్ పెట్టాడు.

అతని నటన బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ అన్ని చాలా బాగున్నాయి. హీరోయిన్ మేధా శంకర్ కూడా బాగా నటించింది. మిగతా నటీనటులు అందరూ కూడా ఈ సినిమా మూడ్ నిలబెట్టారు. శాంతను మోయిత్ర సంగీతం కూడా సినిమాకి తగ్గట్టు ఉంది. రంగరాజన్ రామభద్రం సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగా ఏర్పాటు చేశారు.మొత్తం మీద 12th ఫెయిల్ సినిమా హృదయాలను హత్తుకునే ఒక సున్నిత  చిత్రం. అయితే సరైన ప్రమోషన్ లేకపోవడంతో పైగా యువతని ఆకర్షించే కమర్షియల్ అప్పీల్ లేకపోవడంతో కలెక్షన్స్ సాధించడంలో ఇబ్బంది పడుతుంది. ఈ సినిమాని తెలుగులో కూడా నవంబర్ 3వ తారీఖున విడుదల చేస్తున్నారు.

Also Read:2013 లో “మెహందీ ఆర్టిస్ట్” కి ఇచ్చిన మాటని పదేళ్ల తర్వాత నిలబెట్టుకున్న “దీపిక”..ఏం జరిగిందంటే.?


End of Article

You may also like