ఫుడ్ బిజినెస్ ఆంటీని ప్రమోషన్ కోసం వాడేసారుగా…!

ఫుడ్ బిజినెస్ ఆంటీని ప్రమోషన్ కోసం వాడేసారుగా…!

by Mounika Singaluri

Ads

సినిమా వాళ్లు తమ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లడం కోసం ఎంత దాకా అయినా వెళ్తారు.
ప్రమోషన్స్ డిఫరెంట్ గా చేయడం జనాల్లో సినిమాని ఉండేలా చూసుకోవడంలో ఈమధ్య చాలామంది డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా, వర్షా బోల్లమ, కావ్య తాపర్ హీరోయిన లుగా వస్తున్న ఊరి పేరు భైరవకోన సినిమా ఫిబ్రవరి 9వ తారీఖున విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ టీం చాలా బిజీగా పాల్గొంటుంది. అయితే వీరు చాలా డిఫరెంట్ గా ఫుడ్ బిజినెస్ చేసే ఆంటీ దగ్గరికి వెళ్లి సినిమాని ప్రమోషన్స్ చేశారు.

Video Advertisement

హైదరాబాదులో ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అనేది చాలా క్రేజీగా నడుస్తుంది. రకరకాల వంటకాలతో ఫుడ్ స్టాల్స్ ఓపెన్ చేసి జనాల ఆదరణ పొందుతున్నారు. ఈ ఫుడ్ బిజినెస్ తో నెలకి లక్షల సంపాదించే వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా సాయికుమార్ అనే మహిళ సోషల్ మీడియాలో తన వ్యాపారంతో బాగా ఫేమస్ అయింది. కొన్ని సంవత్సరాల క్రితం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఆమె రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ అందిస్తూ బాగా ఫేమస్ అయింది. ఒకపక్క తన వద్దకు వచ్చే కస్టమర్లతో నాన్న, కన్నా అంటూ ప్రేమగా మాట్లాడుతూ కమ్మనైన భోజనాన్ని అందిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెకు సంబంధించిన రీల్స్ బాగా వైరల్ అయ్యాయి.

తాజాగా ఊరి పేరు భైరవకోన సినిమా టీం ఈ ఆంటీ వందకు వెళ్లి భోజనాన్ని చేశారు. అక్కడ ఉన్న జనంతో తమ సినిమా విశేషాలు పంచుకుని ప్రమోషన్స్ చేశారు. సినిమా టీం కూడా ప్రమోషన్స్ కోసం వెళ్లడంతో ఆమె వద్దకు వెళ్లడంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.


End of Article

You may also like