Ads
Movie theaters in ap & Tg: సినిమా అభిమానులకి బిగ్ షాక్ మరో సారి థియేటర్స్ క్లోజ్ ? కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం లో ఎన్నో రంగాలు నేల కూలాయి. కరోనా మొదటి వేవ్ తరువాత మెల్లిగా కోలుకుంటున్న తరుణం లో మళ్ళీ రెండవ వేవ్ ఉప్పెనలా ఎగిసిపడటం తో మళ్ళీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఇందులో సినిమా రంగం కూడా కూడా ఉంది మొదటి వేవ్ లో సుమారు నాలుగు అయిదు నెలల పాటు సినిమా థియేటర్స్ మూత పడిన తరువాత మళ్ళీ తెరుచుకుని పుంజుకుంటున్న సమయంలోనే మళ్ళీ మరో షాక్ తగిలింది.
Video Advertisement
మరో సారి మూత పడటంతో ఇప్పుడు థియేటర్ల మనుగడ నే ప్రశ్నర్థకంగా మారింది. మరో వైపు మూడవ వేవ్ హెచ్చరికలు, థియేటర్ల రేట్ల విషయంలో సమస్యలు మరింత ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఇక జులై 30 రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి తెరుచుకున్న థియేటర్స్ తెలంగాణ లో వంద శాతం ఆక్యుపెన్సీ తో నడవనుండగా ఏపీ లో మాత్రం యాభై శాతం మాత్రమే అనుమతులు లభించాయి. కేవలం రెండు మూడు సినిమాలే విడుదల అవ్వడం తో వంద శాతం థియేటర్స్ నడవడం లేదు. ఏపీ ప్రభుత్వం నిర్ధారించిన రేట్లకే సినిమాలు ప్రదర్శించాలని తీసుకున్న నిర్ణయాలతో మరింత నష్టం వాటిల్ల నుందని అంటున్నారు. సెకండ్ వేవ్ అనంతరం తెరుచుకున్న థియేటర్స్ పట్ల జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్పాలి. మరో వైపు పెద్ద హీరోల సినిమాలు ఏవీ విడుదల లేకపోవడం తో మరో సారి థియేటర్స్ మూత పడటం ఖాయంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి: PRIYAMANI : ‘నారప్ప’ హీరోయిన్ ప్రియమణి కి షాక్ ఇచ్చిన తన భర్త మొదటి భార్య ఆయేషా!
ఇవి కూడా చదవండి: MAHANATI: మహానటి లో అనుష్క ఎందుకు నటించలేదంటే..?
End of Article