Home Filmy Adda ఇలాంటి సినిమా ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు అనుకుంటా.? గర్బిణీలు చూడద్దు అంట..ఎందుకంటే.?

ఇలాంటి సినిమా ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు అనుకుంటా.? గర్బిణీలు చూడద్దు అంట..ఎందుకంటే.?

by Mohana Priya

ఒకరికి ఒకరు సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీరామ్. ఇప్పుడు శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించిన మరొక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా పేరు పిండం. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది.

సాధారణంగా ఏ సినిమాకి అయినా సరే తప్పకుండా చూడండి అంటూ అందరూ ప్రచారం చేస్తారు. కానీ సినిమాకి మాత్రం కొంత మందిని చూడొద్దు అంటూ సినిమా బృందం ముందే హెచ్చరిస్తోంది. ఈ సినిమాని గర్భిణీ స్త్రీలు అస్సలు చూడకండి అంటూ సినిమా బృందం ఒక హెచ్చరిక ఇచ్చింది.

movie which pregnant women should not see

ఈ సినిమా సెన్సార్ కూడా ఇటీవల పూర్తి అయ్యింది. సాయికిరణ్ దైదా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇది సాయికిరణ్ కి మొదటి సినిమా. ఇందులో ఈశ్వరి రావు, శ్రీనివాస్ అవసరాల కూడా ముఖ్యపాత్రల్లో నటించారు. ఖుషి రవి ఇందులో హీరోయిన్ గా నటించారు. దియా అనే కన్నడ సినిమాతో ఖుషి రవి తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితురాలు అయ్యారు. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఒక ఇంట్లో ఉన్న ఒక ఆత్మ హీరో కుటుంబానికి నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది.

movie which pregnant women should not see

వారికి ప్రాణభయం కూడా తీసుకొస్తుంది. అలాంటి సమయంలో ఆ కుటుంబాన్ని కాపాడడానికి మంత్రగత్తె అయిన ఈశ్వరి రావు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా ప్రధాన అంశం అనేది సినిమా ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా డిసెంబర్ 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ని సినిమా బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

movie which pregnant women should not see

అంతే కాకుండా ఈ సినిమాని గర్భిణీ స్త్రీలు చూడవద్దు అంటూ సెన్సార్ బోర్డు హెచ్చరిక జారీ చేసినట్టు కూడా సినిమా బృందం చెప్పింది. సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు అంటే ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువ. ఇటీవల వచ్చిన థ్రిల్లర్ సినిమాలు అన్నీ కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా అలాగే హిట్ అవుతుంది అంటూ ట్రైలర్ చూసిన వాళ్ళు అందరూ కూడా ఆశిస్తున్నారు.

ALSO READ : CHIRANJEEVI: మెగాస్టార్ సరసన మరోసారి… సీనియర్ హీరోయిన్ కే దక్కిన ఛాన్స్…!

You may also like