“కిక్” తో పాటు… “వక్కంతం వంశీ” స్టోరీ అందించిన 7 సూపర్ హిట్ సినిమాలు..!

“కిక్” తో పాటు… “వక్కంతం వంశీ” స్టోరీ అందించిన 7 సూపర్ హిట్ సినిమాలు..!

by Mounika Singaluri

Ads

వక్కంతం వంశీ… టాలీవుడ్ లో టాలెంటెడ్ రైటర్. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు కథ మాటలు అందించారు. డైరెక్టర్ గా తన మొదటి సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించారు. ఆ సినిమానే నా పేరు సూర్య. ఇది పెద్దగా ఆడలేదు.

Video Advertisement

తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ఇప్పుడు నితిన్ తో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాని తరికెక్కించారు. ఈ సినిమా తాజాగా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. అయితే వక్కంతం వంశీ కథ అందించిన సూపర్ హిట్ సినిమాలు లిస్టు ఒకసారి పరిశీలిద్దాం.

movies for which the story is given by vakkantham vamsi

1. కిక్:

రవితేజ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కిక్. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. రవితేజ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉండడంతో ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఈ సినిమా తోనే తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.

2. ఊసరవెల్లి:

ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఊసరవెల్లి. చిత్రం ఒక డిఫరెంట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కేరక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సరిగ్గా ఆడకపోయినా కూడా అండర్ రేటెడ్ ఫిలిమ్స్ లో ఈ సినిమా ఉంటుంది.

3. ఎవడు:

రామ్ చరణ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ఎవడు. ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఒక డిఫరెంట్ ఫిల్మ్ అని పేరు తెచ్చుకుంది.

4. టెంపర్:

ఫెయిల్యూర్స్ లో ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో ఎన్టీఆర్ లకు సక్సెస్ అందించిన సినిమా టెంపర్. ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ తన కథ కాకుండా బయట కథని డైరెక్ట్ చేశారు. టెంపర్ సూపర్ డూపర్ హిట్ అయ్యి పలు భాషలో రీమేక్ కూడా అయింది.

5. అతిధి:

మహేష్ బాబు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన అతిధి చిత్రం ఒక డిఫరెన్స్ సినిమాగా పేరు తెచ్చుకుంది. సరిగ్గా ఆడకపోయినా కూడా ఈ సినిమా ఒక్క మంచి ప్రయత్నం గా మాత్రం ఉండింది.

6. కిక్ 2:

కిక్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం కిక్ 2. ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ మీద వచ్చిన ఈ చిత్రం కిక్ సినిమా అంతా ఆకట్టుకుపోయిన మంచి ప్రయత్నంగా మిగిలింది.

7. రేసుగుర్రం:

అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన రేసుగుర్రం సెన్సేషనల్ హిట్ అయింది. కమర్షియల్ ఫార్మేట్లో కామెడీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా నిలిచింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం రేసుగుర్రం.


End of Article

You may also like