Home Filmy Adda “పూజా హెగ్డే” రిజెక్ట్ చేసిన 7 సినిమాలు..! అందులో 2 “పవర్‌ స్టార్” సినిమాలే..!

“పూజా హెగ్డే” రిజెక్ట్ చేసిన 7 సినిమాలు..! అందులో 2 “పవర్‌ స్టార్” సినిమాలే..!

by Megha Varna

చాలా ఆలోచించిన తర్వాత హీరో హీరోయిన్లు సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకుంటారు. పూజా హెగ్డే కూడా అలానే నిర్ణయం తీసుకుంటుంది. పూజా హెగ్డే కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించింది.

ఇండస్ట్రీలో నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. అయితే పూజా హెగ్డే పెద్ద పెద్ద హీరోలతో వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకుంది. అయితే మరి పూజ హెగ్డే రిజెక్ట్ చేసిన సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.

#1. వకీల్ సాబ్:

నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఏ హీరోయిన్ వదులుకుంటారు..? కానీ పూజ హెగ్డే మాత్రం ఈ అవకాశాన్ని వదులుకుంది. శృతి హాసన్ చేసిన పాత్రని చేయడానికి పూజ హెగ్డే ని మొదట అనుకున్నారు. కానీ పూజా హెగ్డే రిజెక్ట్ చేసింది.

movies rejected by pooja hegde

#2. మాస్ట్రో:

నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో పూజా హెగ్డే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమాను కూడా పూజాహెగ్డే రిజెక్ట్ చేసింది.

movies rejected by pooja hegde

#3. హరహర వీరమల్లు:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరహర వీరమల్లు సినిమా నటించే అవకాశం వచ్చినా సరే పూజ హెగ్డే వదులుకుంది. ఇప్పుడు నిధి అగర్వాల్ నటిస్తోంది.

movies rejected by pooja hegde

#4. అల్లుడు అదుర్స్:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో నటించే అవకాశాన్ని కూడా పూజాహెగ్డే వదులుకుంది. తనకి డేటెస్ ఎడ్జస్ట్ కావడం లేదు అని పూజా హెగ్డే ఈ సినిమాని రిజెక్ట్ చేసింది.

movies rejected by pooja hegde

#5. ఛత్రపతి హిందీ రీమేక్:

ఈ సినిమాని కూడా పూజ హెగ్డే వదులుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. పూజ హెగ్డే ని ఈ సినిమాలో నటించమని అడిగితే రీమేక్ సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టం లేదని చెప్పేసింది.

movies rejected by pooja hegde

#6. శాకుంతలం:

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం మొదట పూజ హెగ్డే ని అడిగారు. కానీ మొహంజదారో లో ఈమెకి అంతగా కలిసి రాకపోవడంతో ఈ సినిమాలో నటించడానికి ఇష్టపడలేదు.

movies rejected by pooja hegde

 

#7. గుడ్ బై:

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గుడ్ బై లో కూడా ఈమెకు అవకాశం వచ్చింది. అయితే అదే సమయంలో మరో సినిమా రావడంతో ఆమె గుడ్ బై సినిమాకి నో చెప్పేసింది.

movies rejected by pooja hegde

You may also like