మన దేశంలో కరోనాతో మృతి చెందితే… ఆ మృతదేహాన్ని ఏం చేస్తారో తెలుసా?

మన దేశంలో కరోనాతో మృతి చెందితే… ఆ మృతదేహాన్ని ఏం చేస్తారో తెలుసా?

by Megha Varna

Ads

కొత్తగా కరోనా వైరస్ covid 19 ను అధికారికంగా సార్స్-కొవ్- 2 అని పరిగణస్తున్నారు .మనం ఈ వైరస్ ను శ్వాసగా  పీల్చినప్పుడు తాకినప్పుడు ఈ వైరస్ వ్యాప్తి చెంతుంది .ముందుగా గొంతు ,శ్వాస నాళాలు ,ఊపిరితిత్తుల్లో వున్నా కణాలలోకి వ్యాపిస్తుంది .అక్కడ నుండి వైరస్ వృద్ధి చెంది అక్కడ నుండి మిగతా కణాల మీద దాడి చేస్తుంది .ఇది మొదటి దశ .ఈ దశలో మనం జబ్బు ఉన్నదని  గుర్తించలేము కొందమందిలో అయితే ఈ ప్రాథమిక లక్షణాలు కూడా కనపడవు .

Video Advertisement

ఇంక్యూబేషన్ పీరియడ్ అంటే వ్యాధి శరీరంలో మొదలైనప్పటి నుండి లక్షణాలు కనపడే వరుకు ఒక్కొక్కరిలోను ఒక్కో రకంగా ఉంటుంది .అయితే ఈ వైరస్ సోకినవారికి ట్రీట్మెంట్ చేయడం దగ్గరి నుండి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మరియు చనిపోయిన వారి మృతదేహాలను అంత్యక్రియలు చెయ్యడం చాల కష్టమైన పద్దతి ..

ముఖ్యంగా కరోనా తో మరణించిన వారి మృతదేహాలను మాములు మృతదేహాలుగా అంత్యక్రియలు చెయ్యడం కుదరదు .ఐసొలేషన్ వార్డ్ నుండి స్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది .అయితే కేంద్ర ప్రభుత్వం వీటి విషయంలో కొన్ని నిబంధనలు విధించింది . వాటిని తూచా తప్పకుండ పాటించాలి .

ఐసొలేషన్ వార్డ్ లు , మార్చురీ ,అంబులెన్సు ,స్మశాన వాటికలో విధులు నిర్వర్తించే వారు ప్రతేకమైన ట్రైనింగ్ తీసుకుంటారు .దీనితో పాటు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది .డెడ్ బాడీ ని ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచాలి .బ్యాగ్ లోపలి భాగాన్ని హైపో క్లోరైడ్ తో శుభ్రం చెయ్యాలి .మృత దేహాన్ని తరలించే వాహనాన్ని ఒక శాతం సోడియం హైపో క్లోరైడ్ ద్రవంతో శుభ్రం చెయ్యాలి ..

బాడీ ని ఉంచిన బ్యాగ్ ను ముఖం వరకు తెరిచి ఉంచాలి .దేహానికి సంబందించిన  వారిని ఆఖరి సారి చూసేందుకు అనుమతించవచ్చు .శరీరాన్ని తాకడం ముట్టడం వంటివి చేయకూడదు, కానీ మతపరమైన ప్రార్థనలు చేసుకోవచ్చు .సోషల్ డిస్టెన్స్ తప్పక పాటించాలి .ఎక్కువమంది రాకూడదు మరియు గుమిగూడి ఉండకూడదు .అనంతరం స్మశాన వాటిక సిబ్బందితో పాటు వచ్చినవారు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి .

ఐసొలేషన్ వార్డ్ నుండి బాడీని తరలించే ముందు కుటుంబ సభ్యులు చూడాలనుకుంటే దానికి తగిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది .ఐసొలేషన్ ప్రాంతంలో వున్న అన్ని వస్తువులని హైపోక్లోరైడ్ ద్రవంతో శుభ్రం చెయ్యాలి .డెడ్ బాడీ ని సుమారు 4 డిగ్రీల వద్ద కోల్డ్ ఛాంబర్లో ఉంచాలి. స్మశానవాటికనుండి ఇంటికి వచ్చాక. ఇంటిలోపల మరియు చుట్టూ హైపో క్లోరైడ్ సొల్యూషన్ తో శుభ్రం చేయాలి. ఒకవేళ మృతదేహంకి సంబందించిన వస్తువులు హాస్పిటల్ యాజమాన్యం అందచేస్తే అవి కూడా హైపో క్లోరైడ్ సొల్యూషన్ తో శుభ్రం చేయాలి.


End of Article

You may also like