Ads
ఆగస్టు 15 2020 న క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని తను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ప్రజలు ఈ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ధోని అభిమానులైతే ఇంకా షాక్ లోనే ఉన్నారు. ఎంతో మంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేశారు.
Video Advertisement
ఇండియన్ క్రికెట్ టీం ని ముందుకు నడిపించడానికి ధోనీ చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేము అని అంటున్నారు. మొదటి నుండి కూడా ముందుగా ఎటువంటి ఎనౌన్స్మెంట్ లేకుండా డైరెక్ట్ గా విషయాన్ని చెప్పేస్తారు ధోని. అలాగే ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
https://www.instagram.com/tv/CD6ZQn1lGBi/?utm_source=ig_web_copy_link
“ఇప్పటివరకు మీరు నాకు ఇచ్చిన ప్రేమకి సహకారానికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 1929 గంటల నుండి నేను రిటైర్ అయినట్టు పరిగణించండి” అని కాప్షన్ లో రాశారు.
ధోని రిటైర్మెంట్ ప్రకటించిన సమయం 1929. అంటే రాత్రి 7 గంటల 29 నిమిషాలు. 1929 అనే సంఖ్య కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధోని ఈ సమయానికి తన రిటైర్మెంట్ ప్రకటించడం వెనకాల కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అని నెటిజన్లు అంటున్నారు. అవి ఏంటంటే.
మొదటి కారణం ఏమిటంటే 1929 సంఖ్యను ఏంజెల్ నంబర్స్ అంటారు. అంటే ఈ నంబర్లకు న్యూమరాలజీ కి సంబంధం ఉంటుంది. ఈ నెంబర్ ల వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఇలాంటి నంబర్లను అనుకోకుండా చూడడం ద్వారా మంచి జరుగుతుంది అని అంటారు.
ఉదాహరణకి ఇప్పుడు మీరు సడన్ గా మీ ఫోన్ ఆన్ చేస్తే అప్పుడు సమయం 19:29 గంటలు చూపిస్తున్నట్లు అయితే మీరు ఆ నంబర్ ని అనుకోకుండా చూసినట్టు. అప్పుడు మీకు మంచి జరుగుతుంది అని అర్థం. 1111, 222, 111,777 నెంబర్లకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అని మీలో ఎంతో మందికి తెలిసే ఉంటుంది. అలాగే 1929 కూడా పైన చెప్పిన ఏంజెల్ నెంబర్స్ కోవలోకే చెందుతుంది.
1929 నంబర్ ద్వారా మీరు మీ జీవితంలో ఒక సైకిల్ అంటే ఒక దశ పూర్తి చేసినట్టు అర్థం వస్తుంది. అలాగే ఏంజిల్స్ కూడా మీరు తీసుకున్నది సరైన నిర్ణయమని, మీరు సరైన దిశలోనే వెళ్తున్నారు అని ప్రోత్సహిస్తూ సమాచారాన్ని అందిస్తారు.
1 అంటే మీరు మీ ఆలోచనలను నమ్ముతూ మీ జీవితంలో కొత్త ప్రారంభం వైపు వెళ్తున్నారు అని అర్థం. 2 అంటే మీరు మీ బంధాలకి, మీ సన్నిహితులకు విలువ ఇస్తున్నారు, అలాగే లైఫ్ పర్పస్ అంటే జీవితానికి ఒక అర్థం వచ్చేలాగా మీ నిర్ణయాలను తీసుకుంటూ, మీ మనస్సాక్షి చెప్పిన మార్గంలో మీరు ప్రయాణిస్తున్నారు అని అర్థం.
9 సంఖ్య పాజిటివ్ ఆలోచనలకు ఉదాహరణని, నిస్వార్ధాన్ని, మానవత్వాన్ని, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్లకు సహాయం చేసే తత్వాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా 9 నంబర్ ద్వారా మనం చేసే పని నుండి నిష్క్రమించడం, అలాగే జీవితంలో కొత్త దశను ప్రారంభించడం అనే అర్థం కూడా వస్తుంది.
1929 సంఖ్య వెనకాల ఉన్న ఇంకొక కారణం ఏంటి అంటే గతేడాది అంటే 2019 లో టీం ఇండియా ప్రపంచ కప్ నుండి నాకౌట్ అయింది. ధోని చివరిసారిగా మైదానం నుండి బయటికి నడిచారు.
యుజ్వేంద్ర చాహల్ వికెట్ కోల్పోవడంతో ప్రపంచ కప్ నుండి టీమిండియా తప్పుకుంది. గ్రాంట్ ఇలియట్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అప్పుడు సమయం 19:29 అయింది. కాబట్టి ధోనీ ఈ సమయానికి రిటైర్మెంట్ ప్రకటించడానికి వెనక ఇది కూడా ఒక కారణం అని అంటున్నారు.
సెలబ్రిటీలు, ప్రజలతోపాటు సహ క్రికెటర్లు కూడా ధోని వాళ్లకు అందించిన ప్రోత్సాహాన్ని, సహకారాన్ని మర్చిపోలేము అని, టీమ్ ఇండియా లో ధోని లేని లోటు తీర్చడం చాలా కష్టం అని అంటున్నారు. ధోనీతో పాటు సురేష్ రైనా కూడా తన రిటైర్మెంట్ ని ప్రకటించారు.
https://www.instagram.com/p/CD6d3QChY-V/
ధోనీతో పాటు సురేష్ రైనా కూడా ధోనీని ఉద్దేశిస్తూ ” మీతో ఆడటం చాలా ఆనందంగా ఉంది. గర్వంగా నేను కూడా మీ కొత్త ప్రయాణం లో మీతో పాటు నడుస్తాను” అని తన రిటైర్మెంట్ ని ప్రకటించారు. భారత క్రికెట్ టీం కి పేరు తెచ్చిన ఇద్దరు ఉన్నత క్రికెటర్లు తమ క్రికెట్ జీవితానికి స్వస్తి చెప్పడం తో క్రికెట్ ప్రపంచంలో ఒక శకం ముగిసింది అని అంటున్నారు క్రికెట్ అభిమానులు.
End of Article