Ads
మాఫియా గురించి ముద్దు గురించి పూర్తిగా మనకు పూరీ గారి వల్లే తెలిశాయి.అలాంటి ముద్దు ప్రాణం తీస్తుందని మీకు తెలుసా?అవును మీరు విన్నది నిజమే తాజాగా ఇలాంటి ఓ ఘటన చోటు చేసుకుంది.మరి దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
ఫ్లోరిడాలో అథ్లెట్ అయిన అరియానా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది.మొదట ఫీవర్,తలనొప్పి తో బాధపడుతున్న అరియానాని చూసిన తల్లిదండ్రులు ఇది వైరల్ ఫీవర్ అని లైట్ తీసుకున్నారు. కానీ రోజురోజుకీ అరియానా ఆరోగ్యం క్షీణించడం చూసి భయపడిన తల్లిదండ్రులు తనని వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ లో చేర్చారు.
హాస్పిటల్ లో చేరిన అరియానా పరిస్థితి అసలు కుదుట పడలేదు పైగా పిచ్చి పిచ్చిగా మాటలాడటం మొదలుపెట్టింది.దీనితో తల్లిదండ్రుల్లో భయం మరింత ఎక్కువైంది.అందుకే ఆమెను అంబులెన్స్ లో మరో హాస్పిటల్ కు తరలించారు.
ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మోనోన్యుక్లియోసిస్ వ్యాధికి గురైనట్లు గుర్తించారు.ఈ వ్యాధి ఎప్స్టీన్ బార్ వైరస్ ద్వారా వస్తుందని వైద్యులు చెబుతున్నారు.ఈ వ్యాధి బారిన పడడం వల్లనే అరియానా మెదడు వాచింది.అందువల్లే అది పని చేయడం ఆగిపోయింది.దీనితో ఆమె చనిపోయింది.
ఈ వ్యాధి సోకగానే తనని హాస్పిటల్ కు తీసుకువచ్చుంటే తను బ్రతికే ఛాన్స్ ఉందని డాక్టర్స్ అంటున్నారు.ఈ వ్యాధి ముద్దు వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అందుకే దీన్ని కిస్సింగ్ డిసీజ్ అని కూడా అంటారు.అలాంటి డిసీజ్ అరియానాకు ఏ విధంగా సోకిందనేది ఎవరికీ అర్థం కావట్లేదు.ముద్దు వల్లే అరియానాకు ఈ వ్యాధి సోకి ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
End of Article