Ads
ఆసియాలోనే అత్యంత ధనికుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిలియనీర్ అయిన ముఖేశ్ అంబానీ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే.
Video Advertisement
వందల కోట్ల వ్యాపారం, కోట్లలో లాభాలు అందుకునే రిలయన్స్ సంస్థ కలిగిన అంబానీకి ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ అనేక విల్లాలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రాపర్టీని అంబానీ అమ్మేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త అయిన ముకేశ్ అంబానీ ఆసియాలోనే అపర కుబేరుడుగా పేరుగాంచాడు. ముకేశ్ అంబానీకి సంబంధించిన వార్తలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. అంబానీ ఆంటిలియా భవనం ప్రపంచంలోనే రెండవ అత్యంత రిచెస్ట్ హౌస్ గా నిలిచింది. ఈ ఇంటి ఖరీదు 15 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని సమాచారం. ఈ భవనం మాత్రమే కాకుండా అంబానీకి ఇతర దేశాలలో కూడా ఎన్నో భవంతులు ఉన్నాయి. తాజాగా వాటిలో ఒక లగ్జరీ ప్రాపర్టీని అమ్మేసినట్లుగా ఒక న్యూస్ నెట్టింట్లో షికారు చేస్తోంది.
అమెరికాలోని మ్యాన్‌హట్టన్ వెస్ట్ విలేజ్‌లో ఉండే ఒక లగ్జరీ హౌజ్ ను విక్రయించినట్లుగా న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. 2406 చదరపు అడుగులు ఉన్న ఇంటిని 9 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.74.5 కోట్లకు అమ్మినట్లుగా పేర్కొంది. ఇక ఈ లగ్జరీ హౌజ్ హడ్సన్ నదీ తీరంలో ఉందట. రెండు బెడ్‌రూంల నుండి హడ్సన్ నది ప్రకృతి అందాలను చూసే విధంగా ఈ ఇంటిని నిర్మించారని తెలుస్తోంది.
ఈ ఇంటి లోపల భాగాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. జిమ్మీ జాన్సన్, హిల్లరీ స్వాంక్, మార్క్ జాకబ్స్ లాంటి ప్రముఖులు ఈ హౌజ్ ఇంటీరియర్ డిజైన్‌ను అద్భుతంగా రూపొందించారు. గతేడాది అంబానీ అరబ్ సిటీ దుబాయ్‌లో కూడా 640 కోట్ల రూపాయలు పెట్టి ఒక లగ్జరీ విల్లా కొనుగోలు చేశారు.
Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాజీ ప్రధాని “మన్మోహన్ సింగ్”..! ఇలా అయిపోయారేంటి..?
End of Article