Ads
ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ ప్రారంభం అవ్వబోతోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రతీ జట్టు నలుగురు ప్లేయర్లని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అందులో ఒక విదేశీ ప్లేయర్ కచ్చితంగా ఉండాలి. ఈ ప్లేయర్స్ జాబితాని ఆ జట్లు నవంబర్ 30 లోపు అందజేయాలి.
Video Advertisement
ఇదిలా ఉండగా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాని రిటైన్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, ఆల్రౌండర్ కీరన్ పోలార్డ్ ని కూడా రిటైన్ చేసుకోవాలి అని ముంబై ఇండియన్స్ జట్టు భావిస్తోంది.
అది మాత్రమే కాకుండా, సూర్యకుమార్ యాదవ్, లేదా ఇషాన్ కిషన్ ని కూడా జట్టులో కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా, వచ్చే సీజన్లో మరో రెండు కొత్త జట్లు ఐపీఎల్లో భాగం కాబోతున్నాయి. దాంతో క్రికెట్ అభిమానులు ఈ రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే సంవత్సరం రాబోయే ఈ ఐపీఎల్ 2022 మధ్యలో ప్రారంభం అవ్వనున్నట్టు సమాచారం.
End of Article