ఈ 14 మంది సౌత్ మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? అందరికంటే ఎక్కువ ఎవరంటే.?

ఈ 14 మంది సౌత్ మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? అందరికంటే ఎక్కువ ఎవరంటే.?

by Megha Varna

సినిమాకు కథ,నటీనటులు ఎంత ముఖ్యమో సంగీతం కూడా అంతే ముఖ్యం ఈ విషయం తెలిసి కూడా కొందరు పెద్దలు సంగీతం లేకుండా కొన్ని చిత్రాలను తీసి ప్రయోగం చేశారు. కానీ ఆ ప్రయోగాలు ఫలించకపోవడంతో అప్పటినుండి వారు మళ్లీ పాత బాటే పట్టి సినిమాలలో సంగీతాన్ని తప్పనిసరి చేశారు. మన హీరోలు,డైరెక్టర్లు లాగే మ్యూజిక్ డైరెక్టర్ లు సైతం కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు.మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

ఏ. ఆర్.రెహమాన్ : ఈయన సినిమా బడ్జెట్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటారు.ఈయన మినిమం 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు.

అనిరుథ్ : ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చిత్రానికి 2 కోట్లు పారితోషికం తీసుకుంటారు.

ఎస్.ఎస్.తమన్ : ప్రస్తుతం టాలీవుడ్ లో తన హవా చాటుతున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ చిత్రానికి 2 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారు.

యువన్ శంకర్ రాజా : లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తనయుడైన యువన్ శంకర్ రాజా ప్రస్తుతం మిగతావారితో పోలిస్తే కొంత వెనకబడ్డాడు.ఈయన చిత్రానికి 2 కోట్లు పారితోషకం తీసుకుంటారు.

దేవి శ్రీ ప్రసాద్ : ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన దేవి ఓ చిత్రానికి సుమారు 1.5 నుండి 2 కోట్లు వరకు తీసుకుంటాడు.

ఎం.ఎం.కీరవాణి : తెలుగువారికి గర్వకారణమైన కీరవాణి గారు ప్రస్తుతం చిత్రానికి 75 లక్షల నుండి 1.5 కోట్లు తీసుకుంటున్నారు.

మణిశర్మ : కొన్ని దశాబ్దాలు పాటు తెలుగు పరిశ్రమను ఏలిన ఈయన చిత్రానికి 75 లక్షల నుండి 1.5 కోట్లు తీసుకుంటున్నారు.

హారిస్ జయరాజ్ : ఎన్నో లవ్ సాంగ్స్ కు కర్త ,కర్మ,క్రియ అయిన హారిస్ ఓ చిత్రానికి 75 లక్షల నుండి 1.5 కోట్లు తీసుకుంటున్నారు.

జి.వి.ప్రకాష్ : అటు హీరోగా ఇటు మ్యూజిక్ కంపోజర్ గా బిజీగా ఉన్న జి.వి.ప్రకాష్. ప్రస్తుతం చిత్రానికి 60 లక్షల నుండి ఒక కోటి తీసుకుంటున్నారు.

గోపి సుందర్ : ఈయన ఓ చిత్రానికి సుమారు 50 నుండి 80 లక్షలు తీసుకుంటున్నారు.

మిక్కీ జె మేయర్ : దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి ఎన్నో మ్యాజికల్ సాంగ్స్ కు ఊపిరి పోసిన ఈయన ఓ చిత్రానికి సుమారు 50 నుండి 75 లక్షలు తీసుకుంటున్నారు.

తమిజా : మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఎదిగిన తమిజా అటు హీరోగా ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు.ఈయన చిత్రానికి 70 లక్షలు తీసుకుంటున్నారు.

మొహమ్మద్ ఘిబ్రన్  : ఈయన ఓ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడానికి 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

వివేక్ సాగర్ : ఈమధ్య వస్తున్న చిన్న చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ అందరినీ అలరిస్తున్న మ్యూజిక్ సెన్సేషన్ వివేక్ సాగర్ ఓ చిత్రానికి 40 నుండి 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.


You may also like