వధువు పెళ్లి మండపంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూస్తే తప్పక మెచ్చుకుంటారు…!

వధువు పెళ్లి మండపంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూస్తే తప్పక మెచ్చుకుంటారు…!

by Megha Varna

Ads

తాజాగా ఒక వధువు వివాహానికి పక్కన పెట్టిన డబ్బులతో గర్ల్స్ హాస్టల్ కట్టించమని తన తండ్రిని కోరింది. ”గివ్ బ్యాక్ టు సొసైటీ” అనే దానికి ఈమె ఉదాహరణగా నిలిచింది. వివరాల్లోకి వెళితే… రాజస్థాన్ కి చెందిన అంజలి కన్వర్ ని ప్రవీణ్ కి ఇచ్చి నవంబర్ 21 వ తేదీన వివాహం చేశారు.

Video Advertisement

అయితే రిపోర్టు ప్రకారం చూసినట్లయితే.. ఆమె తన తండ్రి తో మాట్లాడి కట్నం కోసం ఉంచిన డబ్బుని మహిళా విద్య కోసం బిల్డింగ్ కట్టించమని కోరింది. దీనితో తన తండ్రి 75 లక్షల రూపాయలని ఇస్తానన్నారు.  సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్త చూసి చాలా మంది నెటిజెన్లు కామెంట్లు చేశారు.

అంజలి యొక్క మనసు ఎంతో విశాలమైనది అంటున్నారు. పెళ్లి సాంప్రదాయాలు పూర్తయిన తర్వాత ఆమె అందరి ఆడపిల్లలకి మంచి చదువు ఉండాలని ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని కట్టించడానికి 50 లక్షల నుంచి 75 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక మహిళ అయి ఉండి నేను విద్యను అందుకున్నాను.

కానీ చాలామంది అమ్మాయిలు చదువుకోలేకపోతున్నారు. అటువంటి విద్యని అందించాలనేది నా ధ్యేయమని అంజలి అన్నారు. అలానే మంచి విద్య ప్రతి ఒక్కరూ పొందాలని ఉద్యోగం కోసం మాత్రమే కాదని మంచి జీవితం కోసం తప్పక ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకోవాలని ఆమె చెప్పారు.

 


End of Article

You may also like