జూనియర్ ఎన్టీఆర్ లాంటి కొడుకు ఉంటే బాగుండేది: రజినీ కాంత్

జూనియర్ ఎన్టీఆర్ లాంటి కొడుకు ఉంటే బాగుండేది: రజినీ కాంత్

by Megha Varna

Ads

జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి నటనతో అద్భుతమైన ఫాలోయింగ్ ని జూనియర్ ఎన్టీఆర్ సంపాదించుకున్నాడు. తాత వారసత్వంతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ప్రత్యేకమైన గుర్తింపును ఎన్టీఆర్ తెచ్చుకున్నాడు. అయితే ఎన్టీఆర్ పై సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కొన్ని షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది. మరి ఇక వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

Jr NTR tests positive for coronavirus

 

నాన్ బాహుబలి కలెక్షన్లు సైతం కొల్లగొట్టిన ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాని మర్చిపోలేము. అమెరికా వంటి దేశాలలో కూడా మంచి కలెక్షన్లను భారీగా కొల్లగొట్టింది అరవింద సమేత. కేవలం ప్రీమియర్ షో తో ఎనిమిది లక్షల డాలర్లను కొల్లగొట్టడం మామూలు విషయం కాదు. ఈ సినిమాకి కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు విమర్శకులు సైతం ప్రశంసలు ఇచ్చారు.

ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే ఎన్టీఆర్ సరసన నటించి అద్భుతంగా తన పాత్రను చేసింది. విలన్ గా జగపతిబాబు కూడా ఆకట్టుకున్నారు. ఏదిఏమైనా ఓవరాల్ గా సినిమా అద్భుతమని చెప్పొచ్చు. ఈ సినిమాని చూసి చాలా మంది నటులు కూడా ప్రశంసలు ఇచ్చారు.

ముఖ్యంగా రజినీకాంత్ ఈ చిత్రాన్ని చూసి మొట్టమొదటిసారి నాకు ఇలాంటి కొడుకు లేనందుకు బాధపడుతున్నాను అని అన్నారు. ఎన్టీఆర్ లాంటి కొడుకు ఉంటే ఎంతో బాగుండేది అంటూ ఆయన యొక్క భావాలను వ్యక్తపరిచారు. రజనీకాంత్ కి ఎన్టీఆర్ కుటుంబంతో ఎంతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా హరికృష్ణతో రజనీకాంత్ కి ఎంతో స్నేహం ఉండేది. హరికృష్ణ మృతి చెందినప్పుడు రజనీకాంత్ జపాన్ లో ఉన్నారట.


End of Article

You may also like