Ads
ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని ప్రాపర్ గా కన్వే చేయకపోతే, రిజల్ట్ మారిపోతుంది. కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే రీమేక్ బాగుంది అనుకునేలా ఉంటాయి.
Video Advertisement
కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఒక వేళ మంచి ఫలితం వచ్చినా కూడా, ఒరిజినల్ సినిమా కంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు. అయితే కేవలం సినిమాలకు మాత్రమే కాదు పాటలకి కూడా వర్తిస్తుంది. వేరే భాషలో హిట్ అయినా, లేకపోతే బాగున్న పాటలని తెలుగులో రీమేక్ చేశారు. అలాగే మన తెలుగులో సూపర్ హిట్ అయిన పాటలు అన్ని వేరే భాషల్లో కూడా రీమేక్ చేశారు.
watch video:
https://www.youtube.com/watch?v=lWLxwjWhEzQ
ఇదే విధంగా ప్రభాస్ హీరోగా నటించిన పౌర్ణమి సినిమాలోని మువ్వలా నవ్వకలా పాటను కూడా రీమేక్ చేశారు. ఈ పాట ఒరిజినల్ గా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా, బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు కలిసి పాడారు. అయితే ఈ పాటని కన్నడలో 5 ఇడియట్స్ అనే సినిమా కోసం రీమేక్ చేశారు.
watch video:
పాట వినడానికి చాలా వింతగా ఉంటుంది. ఈ విషయం పక్కన పెడితే చూడడానికి కూడా ఇంకా విచిత్రంగా ఉంటుంది. మన ఒరిజినల్ పాట ఫీల్ ని పాడు చేశారేమో అనిపిస్తుంది. ఈ ఒక్క పాట మాత్రమే కాదు. ఇదే సినిమా కోసం ఆర్య 2 సినిమా లోని రింగ రింగా పాటను కూడా రీమేక్ చేశారు.
watch video:
End of Article