స్వతంత్ర అభ్యర్థిగా ఎంవీఆర్.. ఇక గెలుపు ఖాయమే

స్వతంత్ర అభ్యర్థిగా ఎంవీఆర్.. ఇక గెలుపు ఖాయమే

by Mounika Singaluri

Ads

ఎంవీఆర్ గ్రూపు సంస్థల అధినేత ఎంవీఆర్ ఏపీ రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టించేలా కనిపిస్తున్నారు..అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆయన
గత రెండు దశాబ్దాలుగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంవీఆర్ ను తమ పార్టీలో చేర్చుకోవాలని అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయని సమాచారం..టికెట్ హామీ ఇస్తేనే జాయిన్ అవుతానని ఎంవీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.. దీంతో ఎంవీఆర్ ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారాం.

Video Advertisement

mvr to contest from anakapally

ఒక ప్రధాన పార్టీ నుంచి టికెట్ ఎంవీఆర్ కు కన్మర్మ్ చేసినా..ఆయన ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు.. ఆ పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. మొదటి సారి రాజకీయాల్లోకి అడుగుపెడుతూ ప్రజా వ్యతిరేకతను తట్టుకోవడం కష్టం అని ఎంవీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే ఇన్నాళ్లూ ఏ పార్టీలోనూ చేరకుండా సొంతంగా ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్న ఎంవీఆర్..ఎన్నికల్లోనూ స్వతంత్రంగా పోటీ చేస్తే బెటర్ అని ఆయన రాజకీయ సహచరులు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది..

ఎన్నో ఏళ్లుగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో ఎంవీఆర్ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు.. వృద్ధులను తీర్థయాత్రలకు పంపడం..రూపాయికే భోజనం.. యువతకు ఉపాధి, విద్య, వైద్యం..ఇలా అనేక రంగాల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.. ఎంవీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు, దేవాలయాల పునరుద్ధరణ లాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రతీ ఇంటికి ఎంవీఆర్ చొచ్చుకుపోయారు.. ఆయన సాయం అందని కుటుంబాలు అరుదు అంటే ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు..

ఇక ఏడాదిలో ఆరు నెలల పాటు ఆధ్యాత్మిక చింతనలోనే గడిపే ఎంవీఆర్..రాజకీయాల్లోకి రావడం కూడా ప్రజల కోసమే..వారికి ఇంకా ఏదైనా చేయొచ్చు కదా అనే..అంటారు.. చూద్దాం మరి ఆయనకు ఇష్టమైన పార్టీ నుంచి టికెట్ వస్తుందా..లేక ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారా.. ఎంవీఆర్ ఇండిపెండెంట్ గా బరిలో దిగితే కచ్చితంగా గెలుస్తారనే టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది.. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

 

 


End of Article

You may also like