Home Filmy Adda NAA SAAMIRANGA 10 DAYS COLLECTIONS: పది రోజుల్లో “నా సామిరంగ” ఎంత వసూలు చేసిందో తెలుసా?

NAA SAAMIRANGA 10 DAYS COLLECTIONS: పది రోజుల్లో “నా సామిరంగ” ఎంత వసూలు చేసిందో తెలుసా?

by Sainath Gopi

సంక్రాంతి పండుగ కానుకగా చాలా సినిమాలు విడుదల అయ్యాయి. వీటిలో నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ సినిమా కూడా ఒకటి. కథ విషయానికి వస్తే ఈ సినిమా 1963 లో మొదలవుతుంది. కిష్టయ్య (నాగార్జున), అంజి (అల్లరి నరేష్) స్నేహితులు. వీరిద్దరి చిన్నతనాన్ని ఈ సమయంలో చూపిస్తారు. ఆ తర్వాత సినిమా 1988 కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే భాస్కర్ (రాజ్ తరుణ్) వీరి జీవితాల్లోకి ప్రవేశిస్తాడు. కిష్టయ్య వరలక్ష్మి అలియాస్ వరాలు (అషిక రంగనాథ్) అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి ప్రేమ కథ ఎంత దూరం వెళ్ళింది? వీరి జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులు ఏంటి? కిష్టయ్య ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ ముద్దుగుమ్మ పేరు కూడా ఒకటి. కళ్యాణ్ రామ్ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల విడుదలైన నా సామిరంగ సినిమాలో నాగార్జునతో పాటు నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఏకంగా హీరో నాగార్జున నటనను డామినేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో ప్రస్తుతం హీరోలు దర్శకులు చూపు ఈ ముద్దుగుమ్మ మీద పడింది.

naa saami ranga movie review

ఇది ఇలా ఉంటె…ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పది రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అంటే… నైజాంలో రూ. 4.78 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.60 కోట్లు, , , వెస్ట్ గోదావరిలో రూ. 1.27 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.60 కోట్లు, కృష్ణాలో రూ. 1.22 కోట్లు గుంటూరులో రూ. 1.44 కోట్లు, నెల్లూరులో రూ. 85 లక్షలు..ఇలా మొత్తంగా రూ. 19.13 కోట్లు షేర్, రూ. 31.55 కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా.

You may also like