3 రోజులు 150కి.మీ నడిచిన 12ఏళ్ల బాలిక…ఇంటికి కొద్ది దూరంలో ఉండగా…!

3 రోజులు 150కి.మీ నడిచిన 12ఏళ్ల బాలిక…ఇంటికి కొద్ది దూరంలో ఉండగా…!

by Megha Varna

Ads

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం విదితమే .దీంతో వలసకార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే .లాక్ డౌన్ కారణంగా తమ సొంత ఊరు వెళ్ళడానికి ఎటువంటి రవాణా మార్గాలు లేకపోవడంతో వందల కిలోమీటర్లు కాలినడక కొనసాగిస్తున్నారు .ఈ నేపథ్యంలో 150 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి కాసేపట్లో ఇంటికి చేరుకోబుతున్న సమయంలో ఓ 12 ఏళ్ళ బాలిక మరణించింది …వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

జమ్లో మడ్కమ్ ఒక పేద కుటుంబానికి చెందిన 12 ఏళ్ళ బాలిక .దీంతో తన కుటుంబ పోషణార్థం తెలంగాణలోని ఓ గ్రామంలో కూలిపనులు చేస్తుండేది .అయితే మళ్లీ లాక్ డౌన్ కొనసాగిస్తారేమో అనే  భయంతో ఏప్రిల్-15న జమ్లో…తనతోటి పనిచేసే 11మందితో కలిసి తన స్వస్థలమైన చత్తీచత్తీస్ ఘడ్ లోని బీజాపుర్ జిల్లాకి చేరుకునేందుకు కాలినడక ప్రారంభించింది.

మూడు రోజుల పాటు అడవుల గుండా 150కి.మీ వరకు ఈ గ్రూప్ కాలినడకతో ప్రయాణించారు. అయితే శనివారం(ఏప్రిల్-18,2020)మధ్యాహ్నాం ఇంకో 14కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంటికి చేరుతాం అనుకునే లోపు హఠాత్తుగా జమ్లోకి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. కొద్దిసేపటికే కుప్పకూలిపోయి మృతి చెందింది . జమ్లో మృత దేహాన్ని అంబులెన్స్ లో తన సొంతవూరికి ఆ గ్రూప్ చేర్చింది.

అయితే తీవ్రమైన డీహైడ్రేషన్,పోషకాహార లోపంతో గతంలో జమ్లో బాధపడినట్లు డాక్టర్లు తెలిపారు. జమ్లోకి కరోనా టెస్ట్ లు కూడా చేసారు.కాగా టెస్ట్లో జమ్లోకి కరోనా నెగిటివ్ గా నిర్దారణ అయ్యింది . జమ్లో…తన శరీరంలోని ఎలక్టోరైట్ అసమతుల్యత కారణంగా కూడా బాధపడి ఉండవచ్చని బీజాపుర్ సీనియర్ డిస్ట్రిక్ట్   మెడికల్ ఆఫీసర్ బీఆర్ పుజారి వెల్లడించారు ..

గత రెండు నెలలుగా తన కూతురు తెలంగాణలో పనిచేస్తూ ఉందని జమ్లో తండ్రి ఆండ్రమ్ మడ్కమ్ చెప్పారు . తరచుగా వాంతులు,కడుపునొప్పితో బాధపడిందని అయన తెలిపారు జమ్లో సరిగా ఆహారం తీసుకునేది కాదు అని తనతో వచ్చిన గ్రూప్ సభ్యులు తెలిపారని ఆయన చెప్పారు. జమ్లో కుటుంబానికి 1లక్ష రూపాయల పరిహారాన్ని చత్తీస్ ఘడ్ ప్రభుత్వం ప్రకటించింది.


End of Article

You may also like