ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి చైతు మనసు మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ అందరి మనసు దోచుకుంది సమంత. ఏం మాయ చేసావే తర్వాత నాగ చైతన్యతో మరో మూడు సినిమాల్లో కలిసి నటించింది. చైతు భార్యగా అక్కినేని ఇంటికోడలిగా భాద్యతలు నిర్వహిస్తూనే సినిమాల్లో పాత్రకి ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ ఎన్నో అవార్డ్స్ అందుకోవడమే కాదు తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది సమంత. ఇప్పటివరకూ అందరూ స్టార్ హీరోలతో జత కట్టి,దక్షిణ భారతదేశంలోనే స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది.

Video Advertisement

ఈ రోజు సమంత పుట్టినరోజు సందర్భంగా నాగచైతన్య ఆమెను సర్‌ఫ్రైజ్‌ చేశారు. సమంత కోసం చైతన్యనే స్వయంగా బర్త్‌ డే కేక్‌ను తయారు చేశారు. అనంతరం సమంత కేక్‌ కట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, చైతన్య కేక్‌ తయారుచేస్తున్న వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఫ్యామిలీ లవ్‌.. నేను ఏం ప్రార్థిస్తున్నానో.. ఊహించడానికి మీ దగ్గర పాయింట్స్‌ లేవు అని కాప్షన్ పెట్టారు సమంత.

 

View this post on Instagram

 

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on