“మీరు నాకు జీవితానికి సరిపడా జ్ఞాపకాలని ఇచ్చారు.!” అంటూ… నాగ చైతన్య ఎమోషనల్ పోస్ట్.!

“మీరు నాకు జీవితానికి సరిపడా జ్ఞాపకాలని ఇచ్చారు.!” అంటూ… నాగ చైతన్య ఎమోషనల్ పోస్ట్.!

by Mohana Priya

Ads

రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, అది కూడా కేవలం యూత్ మాత్రమే కాకుండా, కుటుంబం అంతా చూడాల్సిన సినిమా అని చెప్పారు. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడారు. ఇలాంటి అంశాలను తెరపై చూడటం మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది.

Video Advertisement

love story controversy

ఈ నేపథ్యంలో సినిమా విడుదల అయ్యి సక్సెస్ అయిన సందర్భంగా లవ్ స్టోరీ సినిమా బృందం అంతా సక్సెస్ పార్టీ జరుపుకుంది. ఈ ఈవెంట్ లో అక్కినేని నాగార్జున కూడా అతిథిగా పాల్గొన్నారు. నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ చూసి ఎమోషనల్ అయిన టు నాగార్జున చెప్పారు. ఈవెంట్ లో నాగ చైతన్య, నాగార్జునతో పాటు, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల, అలాగే లవ్ స్టోరీ సినిమాకి సంబంధించిన బృందం అంతా పాల్గొంది.

ఈ ఈవెంట్ లో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరి పేరు లిస్టు రాసుకొని మరి చదివి అందరికీ థాంక్యూ చెప్పారు. అయితే లవ్ స్టోరీ బృందంతో కలిసి దిగిన ఒక ఫోటోని నాగ చైతన్య తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఫోటోని పోస్ట్ చేస్తూ నాగ చైతన్య, “మా లవ్ స్టోరీ బృందం. థాంక్యూ సో మచ్. మీరందరూ నాకు జీవితాంతం గుర్తు పెట్టుకునే జ్ఞాపకాలను ఇచ్చారు” అని రాశారు.


End of Article

You may also like