నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రాబోతున్న సినిమా లవ్‌స్టోరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. రేవంత్ అనే జుంబా ట్రైనర్ పాత్రలో నాగ చైతన్య నటించగా, మౌనిక అనే బీటెక్ గ్రాడ్యుయేట్ పాత్రలో సాయి పల్లవి నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదల ఇప్పటికే పలు సార్లు పోస్ట్‌పోన్ అయ్యింది. ఇప్పుడు సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

1 naga chaitanya

ఈ సందర్భంగా సినిమా బృందం ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొనబోతోంది. అందులోనూ ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి అయితే ఇంటర్వ్యూలలో కచ్చితంగా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో తనకి, సమంతకి సంబంధించిన ఎటువంటి ప్రశ్నలు ఈ ఇంటర్వ్యూ లలో అడగకూడదు అని నాగ చైతన్య షరతు విధించారు అనే వార్త వస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న చర్చపై, విడాకులపై ఎటువంటి ప్రశ్నలు వేయకూడదు అని నాగ చైతన్య తన పీ ఆర్ బృందానికి తెలిపారట. ఈ విషయంపై అక్కినేని కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు.