థాంక్యూ OTT లోకి వచ్చేది అప్పుడే..! ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

థాంక్యూ OTT లోకి వచ్చేది అప్పుడే..! ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

by Mohana Priya

ఇటీవల సినిమాలను ఓటీటీలో ఎన్ని రోజుల తర్వాత విడుదల చెయ్యాలి అనే విషయం పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా మల్టీ ప్లెక్స్ లో బాగా ఆడని సినిమాలను వారం పడి రోజుల తర్వాత, మంచి కలెక్షన్స్, లేదా బిగ్ బడ్జెట్ మూవీ లాంటివి అయితే 50 రోజుల తర్వాత విడుదల చెయ్యాలని నిబంధన ఏర్పాటు చేసుకుంది.

Video Advertisement

ఈ నేపథ్యంలో థ్యాంక్యూ మూవీ ఓటీటీలో విడుదల చేసేందుకు తేదీ ఖరారు అయ్యింది. జూలై 22న రిలీజ్ అయిన ఈ చిత్రం, అంచనాలను చేరుకోలేక పోయింది. అనుకున్నంత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వసూలు చెయ్యలేక పోయింది. దీంతో ఈ సినిమాని రెండు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఆగస్ట్ 11వ తేదీన థ్యాంక్యూ మూవీ, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.

naga chaitanya thank you movie review

ఇకపోతే విక్రమ్ కె.కుమార్ ద్శకత్వంలో…శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై, దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగ చైతన్య, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ ప్లే చెయ్యగా… అవికా గోర్, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించారు.


You may also like