కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే చైనాలో 400 మందికి పైగా ఈ వైరస్ మహమ్మారికి బలయ్యారు. వేల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే కేరళ లో కూడా ఈ వ్యాధి ఒకరికి వచ్చింది.ఈ నేప‌థ్యంలో మీడియాలో వ‌రుసగా భ‌యంక‌ర‌మైన వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Video Advertisement

దీనిపై నాగబాబు తన స్టైల్ లో స్పందించారు. “కరోనా వైరస్ ప్రజల కంటే మీడియాకే వేగంగా వ్యాపిస్తోంది. 90 శాతం మీడియా ఈ భయంకర వైరస్ బారిన పడింది. కానీ, మరణాల గురించి నిర్ధారణ కాలేదు. నిజమైన కరోనా వైరస్‌ నియంత్రణలోకి వస్తుందని భావిస్తున్నాను. అయితే, మీడియాకు పట్టిన వైరస్‌ మాత్రం వదులుతుందన్న ఆశ లేదు” అని మీడియాపై ఫైర్ అయ్యారు.

కొంత మంది మీడియా అంటే నాగ‌బాబుకు ఎందుకంత క‌సి, క‌క్ష అని ఏకిపారేస్తున్నారు. మరికొందరు సూపర్ అదిరింది అంటూ రిప్లైలు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఈ కరోనా వ్యాధి త్వరలో నియంత్రణలోకి రావాలని మనం ఆశిద్దాం.