Ads
చాలా మందికి సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించిన క్యూరియాసిటీ ఉంటుంది. ఆన్ స్క్రీన్ పై కాకుండా.. ఆఫ్ స్క్రీన్ పై వారు ఎలా ఉంటారు..? ఆఫ్ స్క్రీన్ లో వారు ఎలా మాట్లాడతారు..? ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఈ క్రమం లో సెలెబ్రిటీలు కూడా తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలని అనుకుంటారు. చాలా మంది సెలెబ్రిటీలు అభిమానులను కలిసినప్పుడు.. అభిమానులతో మాట్లాడుతున్న టైం మంచి రిలేషన్ మైంటైన్ చేస్తారు.
Video Advertisement
అదే టైం లో.. అభిమానులు మితి మీరు ప్రవర్తించిన సందర్భాలలో కూడా ఇచ్చి పడేస్తుంటారు. అయితే, స్మార్ట్ వే లో మాట్లాడుతూ అభిమానుల్ని మరింత ఆకట్టుకుంటారు. సోషల్ మీడియా వచ్చిన తరువాత ఇలా సెలెబ్రిటీలు అభిమానులతో ముచ్చటించడం మరింత ఎక్కువైంది. అప్పుడప్పుడు లైవ్ లోకి రావడం, లైవ్ లో అభిమానులతో ముచ్చటించడం, చాట్ సెషన్స్ ను పెడుతుండడం వంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాం..
లేటెస్ట్ గా, నాగబాబు గారు ఇన్స్టాగ్రామ్ లో చాట్ సెషన్ ను పెట్టారు. “ఆస్క్ మీ ఏ కొశ్చన్” పేరిట నాగబాబు అభిమానులతో ముచ్చటించారు. సెషన్ లో అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకి నాగబాబు క్రేజీ కౌంటర్లు ఇచ్చారు. ఈ ఆన్సర్లు చూస్తే.. నాగబాబు గారిని పక్కా యంగ్ బాయ్ అనుకుంటారు. అంత స్మార్ట్ గా ఒక్కొక్కరికి ఇచ్చి పడేసారు.
మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్.? అని ఓ నెటిజెన్ అడిగిన అర్ధంలేని ప్రశ్నకు తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు నాగబాబు గారు. మా ఆవిడ రెండో పెళ్లికి యాక్సెప్ట్ చేయలేదని చెప్పాడు. కనీసం రెండో పెళ్లి ఆలోచన వచ్చినా పీక కోస్తానని భార్య తనకు ప్రేమగా చెప్పిందని నాగబాబు రిప్లై ఇచ్చారు.
End of Article