Home Bigg Boss 5 telugu “అన్నిసార్లు ఆ పదం వాడాల్సిన అవసరం ఏంటి.?” అంటూ ప్రియకి నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్.!

“అన్నిసార్లు ఆ పదం వాడాల్సిన అవసరం ఏంటి.?” అంటూ ప్రియకి నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్.!

by Mohana Priya

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 6 వారాలు గడిచింది. ప్రస్తుతం ప్రోగ్రాం ఆరవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన ఐదు ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎలిమినేషన్ లో శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు కూడా మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతున్నారు అని సమాచారం.

nagarjuna counter to priya in bigg boss telugu 5 1

ఇదిలా ఉండగా ఈ వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో నాగార్జున కంటెస్టెంట్స్ తో ఈ వారం జరిగిన గొడవల గురించి చర్చిస్తున్నారు. ఈవారం సన్నీకి, ప్రియకి మధ్య గొడవ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై నాగార్జున స్పందించారు. గొడవ జరుగుతున్నప్పుడు ప్రియ చాలా సార్లు “చెంప పగులుతుంది” అనే పదం వాడారు. “ఆ పదం ఎందుకు వాడాల్సి వచ్చింది?” అని నాగార్జున అడిగారు. అందుకు ప్రియ, “సన్నీ తనని చాలా గట్టిగా తోసేశారు” అని చెప్పారు. “సరే. ఒక సారి పదం వాడావు పర్లేదు. కానీ తర్వాత పూల కుండి ఎందుకు ఎత్తావు” అని అడిగారు. అందుకు సన్నీ, “నేను ఇది చూడలేదు సార్” అని చెప్పారు.

watch video :

You may also like