“హలో బ్రదర్” సినిమాలో నాగార్జునకు డూప్ గా నటించిన హీరో ఎవరో తెలుసా?

“హలో బ్రదర్” సినిమాలో నాగార్జునకు డూప్ గా నటించిన హీరో ఎవరో తెలుసా?

by Mohana Priya

Ads

ఎంతో మంది నటులు కేవలం సిల్వర్ స్క్రీన్ పై నటించడమే కాకుండా సినిమాకి సంబంధించిన మరెన్నో వృత్తులు కూడా చేస్తారు. ఉదాహరణకి నాని హీరో అవ్వకముందు రాధాగోపాళం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. అలాగే రేడియో జాకీ కూడా. రానా కూడా సైనికుడు సినిమా కి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో పని చేశారు. అంతే కాకుండా బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ క్యాటగిరి లో సైనికుడు సినిమా కి రానా నంది అవార్డు కూడా అందుకున్నారు.

Video Advertisement

 

కొంతమంది నటులు వేరే నటులకి డూప్ గా కూడా చేశారు. ఇవన్నీ సినిమాల్లోకి రాకముందు చేసి ఉంటారు. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక హీరో ఇంకొక హీరో కి డూప్ గా చేశారు. వివరాల్లోకి వెళితే. 1994 లో వచ్చిన హలో బ్రదర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

 

ఇవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున డబుల్ రోల్ చేశారు. షూటింగ్ సమయంలో నాగార్జున ఒక పాత్రలో యాక్ట్ చేస్తున్నప్పుడు మరొక నాగార్జున పాత్రలో యాక్ట్ చేయడానికి ఖచ్చితంగా వేరే మనిషి కావాలి. అంటే ఇంకొక నాగార్జున గా నటించడానికి ఒక డూప్ కావాలి.

 

పైన చెప్పినదంతా చదివారు కాబట్టి, నాగార్జునకి డూప్ గా యాక్ట్ చేసింది మరొక హీరో అనే విషయం మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. నాగార్జున కి డూప్ గా నటించిన ప్రముఖ హీరో మరెవరో కాదు శ్రీకాంత్. ఒక రోజు నాగార్జున హలో బ్రదర్ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేస్తున్నారట. అప్పుడు శ్రీకాంత్ కూడా అక్కడే దగ్గరలో ఉన్న ఒక లొకేషన్ లో షూటింగ్ చేస్తున్నారట.

 

ఈ విషయం తెలుసుకున్న నాగార్జున శ్రీకాంత్ హైట్, ఫిజిక్ తన లాగే ఉంటుంది అని, అందుకే మరొక నాగార్జున పాత్రలో శ్రీకాంత్ ని నటించమని అడిగారట. శ్రీకాంత్ కూడా వెంటనే నటించడానికి ఒప్పుకున్నారట. అలా హలో బ్రదర్ సినిమా లో నాగార్జున కి డూప్ గా శ్రీకాంత్ నటించారట.


End of Article

You may also like