Home Bigg Boss 5 telugu “బిగ్ బాస్ సీజన్-5” కి హోస్ట్ గా నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

“బిగ్ బాస్ సీజన్-5” కి హోస్ట్ గా నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

by Mohana Priya

ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎట్టకేలకు మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. గత రెండు సీజన్ల లాగానే ఈ సీజన్ కూడా నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు.Nagarjuna remuneration for Telugu Bigg Boss 5

మొదటి 2 సీజన్లు జూనియర్ ఎన్టీఆర్, నాని హోస్ట్ చేసినా కూడా మూడవ సీజన్ నుండి హోస్ట్ గా కొనసాగుతున్నారు నాగార్జున. ఈ సీజన్ కి నాగార్జున పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ కి నాగార్జున తీసుకునే పారితోషకం దాదాపు 12 కోట్లు. వీకెండ్ లో ప్రసారం అయ్యే ఒక్క ఎపిసోడ్ కి దాదాపు 12 లక్షల రూపాయలు పారితోషకం తీసుకుంటున్నారు నాగర్జున.Netizens comments on Nagarjuna mistake during shanmukh entry in Bigg Boss

ప్రేక్షకులు కూడా నాగార్జున హోస్టింగ్ ని విపరీతంగా ఇష్టపడటంతో కింగ్ నాగార్జున అదే స్థానంలో కొనసాగుతున్నారు. నాగార్జున కంటెస్టెంట్స్ తో మాట్లాడే తీరు, అలాగే వారు చేసే తప్పుల్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ఘోస్ట్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

You may also like