ఎన్నో గొడవలు, కాంట్రవర్సీలు, మధ్యలో టాస్క్ లతో నాలుగవ వారం పూర్తి చేసుకుంది బిగ్ బాస్ సీజన్ ఫోర్. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఎక్కువవడంతో కింగ్ నాగార్జున కూడా వీకెండ్ ఎపిసోడ్స్ లో కొంచెం స్ట్రిక్ట్ గానే మాట్లాడుతున్నారు.

అలాగే కంటెస్టెంట్స్ ఎక్కువగా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ, గేమ్ ఆడకుండా, అన్నిటినీ ఎమోషనల్ గా తీసుకుంటూ ఉండటంతో ఎవరి గేమ్ వారు ఆడాలి అనే విషయాన్ని కంటెస్టెంట్స్ కి అర్థం అయ్యేలా చెప్తున్నారు నాగార్జున. అయితే నాగార్జున హోస్టింగ్ నుండి దూరం అవ్వబోతున్నారట. కానీ టెంపరరీ గానే. వివరాల్లోకి వెళితే.

సాక్షి కథనం ప్రకారం నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ ముందు మొదలైంది. కానీ మధ్యలో కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఇటీవల షూటింగ్ మళ్ళీ మొదలైంది. వైల్డ్ డాగ్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ షెడ్యూల్ థాయిలాండ్ లో జరగబోతోందట. షూటింగ్ దాదాపు 20 రోజులు జరగనుందట.

ఆ 20 రోజుల్లో నాగార్జున వచ్చేది వీకెండ్ ఎపిసోడ్స్ కి కాబట్టి దాదాపు ఆరు ఎపిసోడ్స్ లో నాగార్జున బిగ్ బాస్ షో లో కనిపించరట. షో యాజమాన్యం కూడా నాగార్జున లేని ఎపిసోడ్స్ లో గతంలో లాగా రమ్య కృష్ణని కానీ, లేదా ఇంకెవరినైనా హోస్ట్ గా సబ్స్టిట్యూట్ చేద్దాం అని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.