Ads
జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా వారిపై వారికి నమ్మకం ఉండాలి. అలాగే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనేది కూడా క్లియర్ గా తెలుసుకోవాలి. అలా కాకుండా ఎవర్ని పడితే వాళ్లని గుడ్డిగా నమ్మేస్తూ పోతే అనవసరంగా మోసపోవాల్సి వస్తుంది.
Video Advertisement
మనం అందర్నీ నమ్మడం వల్ల వెన్నుపోటు కూడా పొడుస్తూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఏ మనిషిని నమ్మాలి.. ఏ మనిషిని నమ్మకూడదు అనేది తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం పై ఇక్కడ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. మరి మీరు కూడా చూసి మీకు నచ్చిన వాటిని నచ్చిన వారితో పంచుకోండి.
#1. జీవితంలో ఏదీ శాశ్వతం కావు.. చెప్పేవి అన్ని నిజాలు కావు.. ఎవరిని నమ్మలేము.. నమ్మకుండా బతకలేం.. అదే జీవితం..!
#2. మాట ఇవ్వడానికి తొందరపడకు.. ఇచ్చిన మాట నెరవేర్చడానికి వెనుకాడకు..
#3. నమ్మకం లేని స్నేహం, నమ్మకం లేని ప్రేమ, నమ్మకం లేని బంధం మనశ్శాంతిని దూరం చేస్తాయి.
#4. ఒకసారి నమ్మాలి.. రెండోసారి మోసపోవద్దు..
#5. నమ్మిన మనిషి కంటే నమ్మకంగా ఉండేవి జంతువులే..
#6. నమ్మకపోతే అనుమానస్తుడు అంటారు
నమ్మితే అమాయకుడిని చేస్తారు…
#7. నమ్మకం మాటల్లో వినబడేది చేతల్లో కనబడేదే..
#8. ఇతరులు పైన మీకు ఉన్న విశ్వాసం, నమ్మకం మీ మీద మీకు ఉంటే ఎంతటి కార్యములునయినా చేయవచ్చును కాదంటారా..?
#9. నమ్మకు నమ్మకు నమ్మకు
నీ నీడనైనా నమ్మి.. సాహచర్యం చేయకు
అంతా స్వార్ధం, స్వార్ధం, స్వార్ధం..
#10. ఏది నమ్మాలో
ఏది నమ్మకూడదో తెలిస్తే
జీవితం ఇంత క్లిష్టంగా ఉండదేమో..
End of Article