Home Biography నమ్రత చెల్లి “శిల్పా శిరోద్కర్” గురించి ఈ విషయాలు తెలుసా.? ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో.?

నమ్రత చెల్లి “శిల్పా శిరోద్కర్” గురించి ఈ విషయాలు తెలుసా.? ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో.?

by Mohana Priya

మోడలింగ్ తో తన కెరీర్ మొదలు పెట్టి, మిస్ ఇండియా కిరీటం గెలుచుకొని, తర్వాత నటిగా కూడా రాణించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు నమ్రత శిరోద్కర్. నమ్రత శిరోద్కర్ 1998 లో ఒక హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాలు, ఒక కన్నడ సినిమా, అలాగే ఒక మలయాళం సినిమాలో కూడా నటించారు.

namrata shirodkar sister shilpa shirodkar

2000 సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తర్వాత కొన్ని హిందీ సినిమాలు, అలాగే ఒక మరాఠీ సినిమాలో కూడా నటించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో అంజి సినిమాలో నటించారు నమ్రత శిరోద్కర్. ప్రస్తుతం నమ్రత వ్యాపార బాధ్యతలను చూసుకుంటున్నారు.

namrata shirodkar sister shilpa shirodkar

నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. శిల్పా శిరోద్కర్ కూడా నటిగా ఎంతో గుర్తింపు సంపాదించారు. 1989 లో భ్రష్టాచార్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు శిల్పా. ఆ తర్వాత ఎన్నో హిందీ సినిమాల్లో నటించారు. 1992 లో మోహన్ బాబు గారు హీరోగా నటించిన బ్రహ్మ సినిమాతో తెలుగులో కూడా అడుగుపెట్టారు శిల్పా శిరోద్కర్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

namrata shirodkar sister shilpa shirodkar

namrata shirodkar sister shilpa shirodkar

ఆ తర్వాత ఎన్నో హిందీ సినిమాలతో పాటు ఒక తమిళ సినిమాలో కూడా నటించారు. శిల్పా శిరోద్కర్ సినిమాల్లో మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించారు. శిల్పా శిరోద్కర్, 2000 సంవత్సరంలో యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన బ్యాంకర్ అయిన అపరేష్ రంజిత్ ని పెళ్లి చేసుకున్నారు.

namrata shirodkar sister shilpa shirodkar

namrata shirodkar sister shilpa shirodkar

వారిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. శిల్పా శిరోద్కర్, నమ్రత శిరోద్కర్ తరచుగా కలుస్తూనే ఉంటారు. శిల్పా, నమ్రత కి మాత్రమే కాకుండా మహేష్ బాబు, గౌతమ్, సితారకి కూడా చాలా క్లోజ్ అనే విషయం వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే అర్థమైపోతుంది.

namrata shirodkar sister shilpa shirodkar

watch video:

https://youtu.be/aUIDJOZ89n4

You may also like