విజయ్ సేతుపతి తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో ఆయనకు చాలా క్రేజ్ ఉంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన పిజ్జా, నేను రౌడీ నే వంటి డబ్బింగ్ సినిమాలు తెలుగులో హిట్ టాక్ సంపాదించుకున్నాయి. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు విజయ్ సేతుపతి.reason behind vijay sethupathi dubbing in uppena

పాత్ర నిడివి తక్కువే అయినా కూడా మెగాస్టార్ మీద ఉన్న అభిమానంతో నటించాను అని ఒక సందర్భంలో విజయ్ సేతుపతి అన్నారట. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుండి పరిచయమైన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాలో కూడా హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు విజయ్ సేతుపతి. అయితే, ఇప్పుడు విజయ్ సేతుపతి పై బాలయ్య అభిమానులు చాలా కోపంగా ఉన్నారట. అందుకు కారణం బాలయ్య సినిమాలో నటించడానికి విజయ్ సేతుపతి తిరస్కరించడం అని తెలుస్తోంది.

balayya-babu-akhanda-news

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతి ని సంప్రదించారట. కానీ ఆ పాత్రని విజయ్ సేతుపతి తిరస్కరించడంతో బాలకృష్ణ సినిమాలో నటించడానికి విజయ్ సేతుపతి ఒప్పుకోలేదు అని నందమూరి అభిమానులు ఆగ్రహానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం మాత్రం సినిమా బృందానికి మాత్రమే తెలియాలి.