మీరు ఇప్పటి వరకు చూడని నందమూరి బాలకృష్ణ అరుదైన ఫోటోలు..!

మీరు ఇప్పటి వరకు చూడని నందమూరి బాలకృష్ణ అరుదైన ఫోటోలు..!

by Mohana Priya

Ads

సినిమా వారసత్వంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా కూడా, తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ ఇప్పటికి కూడా యంగ్ హీరోలకి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం బాలకృష్ణ నటించిన ఒక్క సినిమా అయినా రిలీజ్ అవుతుంది. గత సంవత్సరం అయితే ఏకంగా రెండు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సంవత్సరం కూడా బాలకృష్ణ నటించిన ఒక సినిమా విడుదల అవుతుంది. బాలకృష్ణ ఇప్పుడు రాజకీయాలతో పాటు, సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు.

Video Advertisement

nandamuri balakrishna rare pictures

ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల చేశారు. దీనికి మంచి స్పందన లభించింది. బాలకృష్ణ మరొక కొత్త పాత్రలో నటిస్తున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో పాటు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంతు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. వీర సింహారెడ్డి లో ఒక రకమైన పాత్ర పోషించిన బాలకృష్ణ, భగవంత్ కేసరి సినిమాలో మరొక రకమైన పాత్ర పోషించారు. కూతురిలా పెంచుకున్న అమ్మాయి కోసం ఎంత దూరం అయినా వెళ్ళే వ్యక్తిగా బాలకృష్ణ నటించారు. ఈ సినిమాతో ఒక మంచి మెసేజ్ కూడా అందించారు.

ఆడపిల్లలని కేవలం ఇంటికి పరిమితం చేయకుండా, చదివించాలి అని, వాళ్లని సైన్యంలోకి కూడా పంపించాలి అనే ఒక మెసేజ్ ఈ సినిమాలో ఉంటుంది. కమర్షియల్ సినిమాలు చేస్తూనే, తనదైన శైలిలో బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ తో దూసుకుపోతున్నారు బాలకృష్ణ. బాలకృష్ణ జీవితంలో ఎన్నో ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. కానీ వాటన్నిటి నుండి ఏదో ఒకటి నేర్చుకుని, బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాకి అది రిపీట్ అవ్వకుండా తనని తాను మెరుగుపరుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలు అని అంటారు. వారిలో ఒక ముఖ్య వ్యక్తిగా బాలకృష్ణ ఉన్నారు. నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. బాలకృష్ణ అరుదైన ఫోటోలు కొన్ని ఇవే.

#1

#2#3#4#5#6#7

#8#9#10#11#12#13#14#15


End of Article

You may also like