లేటు వయసులో లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన.. నందమూరి నట వారసుడు!

లేటు వయసులో లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన.. నందమూరి నట వారసుడు!

by Mounika Singaluri

Ads

నందమూరి కథానాయకుడు, సీనియర్ ఎన్టీఆర్ మనవడు చైతన్య కృష్ణ లేటు వయసులో లేటెస్ట్ గా సినిమా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పేరు బ్రీత్. డిసెంబర్ 2న విడుదలై ఫ్లాప్ ని మూట కట్టుకుంది. కానీ నందమూరి చైతన్య కృష్ణ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. సినిమా సంగతి పక్కన పెడితే చైతన్య గురించి తెలుసుకోవటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఈ చైతన్య కృష్ణ ఎవరంటే సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కొడుకే ఈ చైతన్య కృష్ణ.

Video Advertisement

ఈయన గతంలో జగపతిబాబు సినిమా ధమ్ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటించాడు. కానీ ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోయాడు. అటుపై సినిమాలపై దృష్టి సారించలేదు. కానీ అతని మనసులో నటనపై ఆసక్తి మాత్రం అలాగే ఉంది. కొన్ని రోజులు చైతన్య కృష్ణ రాజకీయాలలో కూడా కనిపించాడు. అటుపై మళ్లీ సినిమాలపై దృష్టి మళ్లించి లేటు వయసులో బ్రీత్ సినిమాలో నటించాడు. మెడికల్ మాఫియా కథా నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తనకి గుర్తింపు దక్కడంలో సక్సెస్ అయ్యాడు చైతన్య కృష్ణ.

డిసెంబర్ 2వ తారీఖున విడుదలైన బ్రీత్ చిత్రానికి దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. ఈ సినిమాని జయకృష్ణ నిర్మించడం విశేషం. సాధారణంగా ఒక వయసు దాటిన తర్వాత సినిమాల్లోకి రావడానికి చాలామంది ఆలోచిస్తారు కానీ చైతన్య కృష్ణ నటన మీద ఉన్న ఆసక్తితో అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు.

బ్రీత్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చైతన్య కృష్ణ ఒక రకమైన ట్రోల్స్ కి గురయ్యాడు. అందుకు కారణం ఆయన వయసు. వాటిని పట్టించుకొని వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు వచ్చి తన కళాతృష్ణ తీర్చుకున్న చైతన్య కృష్ణ ని నిజంగా మెచ్చుకొని తీరాల్సిందే. నిజంగా అతని నటన పలువురి దర్శకుల దృష్టిలో పడితే మరొక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ టాలీవుడ్ కి దొరికినట్లే.


End of Article

You may also like