సమర సింహా రెడ్డి డైలాగ్‌ చెప్పలేక తంటాలు పడిన నందమూరి చైతన్య కృష్ణ..! బాబాయ్ డైలాగ్ ని ఇలా చేసేసాడు ఏంటి..?

సమర సింహా రెడ్డి డైలాగ్‌ చెప్పలేక తంటాలు పడిన నందమూరి చైతన్య కృష్ణ..! బాబాయ్ డైలాగ్ ని ఇలా చేసేసాడు ఏంటి..?

by kavitha

Ads

ఎన్టీ రామారావు ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో చైతన్య కృష్ణ. ఎన్టీ రామారావుపెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ. ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి నెట్టింట్లో ట్రోలింగ్ కు  గురవుతున్నాడు.

Video Advertisement

ఈ మధ్య కాలంలో నందమూరి చైతన్య కృష్ణ నటించిన చిత్రాలకు సంబంధించి కొన్ని సీన్స్ విపరీతంగా ట్రోలింగ్ కు గురి అవుతున్నాయి. చైతన్య కృష్ణ ఎక్స్‌ప్రెషన్స్, ఫైట్స్, నడక వంటి ప్రతీ అంశం పైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా  సమర సింహా రెడ్డి మూవీ డైలాగ్‌ను చెప్పి నెట్టింట్లో వైరల్ గా మారాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

నందమూరి చైతన్య కృష్ణ ‘బ్రీత్’ మూవీతో హీరోగా మారాడు. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీనివంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కించాడు. ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ అయ్యింది. కానీ ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య కృష్ణ ఇచ్చిన స్పీచ్, డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ జరిగింది. బ్రీత్ సినిమా ఒక రికార్డ్ సృష్టించింది. జీరో షేర్ అందుకున్న  సినిమాగా నిలిచింది. ఒక్క టికెట్ సేల్ కాలేదని నెట్టింట్లో విమర్శలు వచ్చాయి.

తాజాగా నందమూరి చైతన్య కృష్ణ సమర సింహా రెడ్డిని రీ రిలీజ్ సంబంధించిన వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా  చైతన్య కృష్ణ స్టేజ్ పైన డైలాగ్ చెప్పేందుకు ఇబ్బంది పడ్డాడు. ఫ్యాక్షన్ చిత్రాలు చేయడం బాబాయ్‌ వల్లే అవుతుందని, ఆయనలా ఎవరు డైలాగ్స్ చెప్పలేరని ఇలా చెప్పుకుపోయారు. ఈ క్రమంలోనే సమర సింహా రెడ్డి మూవీలోని “నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా” అనే   డైలాగ్ చెప్పడానికి చైతన్య కృష్ణ తడబడ్డాడు. పక్కన ఉన్న యాంకర్ ప్రాప్టింగ్ ఇచ్చినప్పటికి డైలాగ్ చెప్పలేకపోయాడు. అలా డైలాగ్ చెప్పడానికి ఆయన తంటాలు పడుతుంటే, పక్కన ఉన్నవారందరు నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”లో అలా చేయడమే “మైనస్” అయ్యింది…కెరియర్ క్లోజ్ అయిపోయింది అంటూ “అర్చన” కామెంట్స్.!


End of Article

You may also like