Home Filmy Adda తమ్ముడి కొడుకే అయినా కూడా నందమూరి కల్యాణ చక్రవర్తిని ఎన్టీఆర్ ఎందుకు దూరం పెట్టారు..?

తమ్ముడి కొడుకే అయినా కూడా నందమూరి కల్యాణ చక్రవర్తిని ఎన్టీఆర్ ఎందుకు దూరం పెట్టారు..?

by Sainath Gopi

నందమూరి కుటుంబం నుంచి ఆయన కుమారులు బాలకృష్ణ హరికృష్ణతో పాటు ఆయన తమ్ముడి కుమారుడు అయిన కళ్యాణ చక్రవర్తి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్లపాటు సినిమాలలో నటించి ఆపై ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆయనే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఈయన సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు కొడుకు.

ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు. అసలు కళ్యాణ చక్రవర్తి సినిమాలలోకి రాకముందు నుంచి ఆయనని సినిమాలకి ఇంట్రడ్యూస్ చేద్దాం అంటూ ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చేవారు. ఆ సమయానికి కళ్యాణ చక్రవర్తికి చదువు పూర్తి కాకపోవటంతో తర్వాత చూద్దాం అనేశారు త్రివిక్రమ రావు.

did you remember hero kalyan chakravarti..

ఆ తర్వాత మొదటిసారిగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో అత్తగారు స్వాగతం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కళ్యాణ చక్రవర్తి. స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ గారే క్లాప్ కొట్టి పూజ కార్యక్రమాలు చేశారు. మొదట్లో ఆయన కళ్యాణ చక్రవర్తి విషయంలో బాగానే ఇన్వాల్వ్ అయ్యేవారు కానీ ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. ఆ టైంలో సీనియర్ ఎన్టీఆర్ బాలయ్య పై ఫోకస్ పెట్టి ఆయనని మాత్రమే ప్రోత్సహించేవారు అప్పట్లో ఇదే విషయం గా పత్రికలలో సొంత కొడుకుని ప్రోత్సహించటం కోసమే తమ్ముడు కొడుకుని ఎన్టీఆర్ పట్టించుకోవట్లేదు అని వార్తలు వచ్చేవి.

Nandamuri Hero Kalyan Chakravarthy

అయినప్పటికీ మామ కోడలు సవాల్, ఇంటిదొంగ, మారణ హోమం వంటి సినిమాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు కళ్యాణ్ చక్రవర్తి. తండ్రి చెప్పిన సినిమాలన్నీ చేస్తూ మంచి కొడుకుగా ఉన్నారు. తర్వాత కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. లంకేశ్వరుడు సినిమాలో చిరంజీవికి బావమరిదిగా, చిరంజీవిని పట్టుకోవడానికి ప్రయత్నించే ఒక పోలీస్ ఆఫీసర్ గా ఆయన నటన ఇప్పటికీ గుర్తుంటుంది.

did you remember hero kalyan chakravarti..

నటనలో ఆయన బిజీగా ఉన్న సమయంలోనే కళ్యాణ్ చక్రవర్తి తమ్ముడు హఠాన్మరణం ఆయనని కృంగదీసింది. ఆ తర్వాత తండ్రి కూడా ప్రమాదం బారిన పడ్డారు కానీ చావు తప్పించుకొని పూర్తిగా బెడ్ కి పరిమితం అయిపోయారు. దాంతో తండ్రి బాధ్యత ఇంటి బాధ్యత కూడా కళ్యాణ్ చక్రవర్తి మీద పడటంతో కెరియర్ మధ్యలోనే ముగిసిపోయింది. ఇప్పుడు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ చెన్నైలో ఉంటున్నట్లు సమాచారం

You may also like