Ads
- చిత్రం : బింబిసార
- నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్, కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్.
- నిర్మాత : హరి కృష్ణ కే
- దర్శకత్వం : మల్లిడి వశిష్ట
- సంగీతం : చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఎమ్ ఎమ్ కీరవాణి
- విడుదల తేదీ : ఆగస్ట్ 5, 2022
Video Advertisement
స్టోరీ :
సినిమా 500 సంవత్సరంలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. సినిమా మొత్తం అప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎపిసోడ్స్ గా చూపిస్తారు. బింబిసారుడు (కళ్యాణ్ రామ్) అనే ఒక గర్వం ఉన్న రాజు మీద ఈ కథ అంతా నడుస్తుంది. బింబిసారుడు ఇప్పుడు ఉన్న కాలంలో హైదరాబాద్ లో అడుగుపెడతాడు. అసలు బింబిసారుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఎందుకు వస్తాడు? మళ్లీ తన కాలానికి తను వెళ్ళిపోతాడా? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సాధారణంగా కళ్యాణ్ రామ్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేసే హీరో అనే పేరు ఉంది. కొత్త దర్శకులని ప్రోత్సహించడంలో కళ్యాణ్ రామ్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు అలాగే మరొక కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతేకాకుండా మొదటిసారిగా కళ్యాణ్ రామ్ ఒక సోషియో ఫాంటసీ సినిమా చేశారు. ఇలాంటి పాత్రలో కళ్యాణ్ రామ్ నటించడం కూడా ఇదే మొదటి సారి. ఈ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడ్డారు. బరువు తగ్గి, మేకోవర్ అయ్యి ఒక రాజు పాత్రకి ఎలా అయితే ఉండాలో అలాగే ఉన్నారు. తన కష్టమంతా సినిమాలో కనిపిస్తోంది.
ఇంత కథ విషయానికి వస్తే సినిమా సబ్జెక్ట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇలాంటి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. వశిష్ట కొత్త దర్శకుడు అయినా సరే, కథని హ్యాండిల్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. సినిమా పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కథ అంతా ఒక పాప చుట్టూ తిరుగుతుంది. ఆ పాప కూడా బాగా నటించింది. సినిమాలో చాలా మంది తెలిసిన నటీనటులు ఉన్నారు. వారందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఫస్ట్ హాఫ్ లో కొంత వరకు మెల్లగా సాగుతుంది. కానీ తర్వాత మాత్రం స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా ఉంటుంది.
ప్లస్ పాయింట్స్ :
- కథ
- గ్రాఫిక్స్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- సెట్టింగ్స్
మైనస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ లో స్లోగా ఉండే కొన్ని సీన్స్
రేటింగ్ :
3.5/5
ట్యాగ్ లైన్ :
సినిమా మీద మరీ ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా, ఒక మంచి సోషియో ఫాంటసీ సినిమా, అలాగే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమా చూడాలి అని అనుకునే వారికి బింబిసార ఒకసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
End of Article