నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ మొదటివారం కలెక్షన్స్ ఎంత అంటే..?

నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ మొదటివారం కలెక్షన్స్ ఎంత అంటే..?

by Mohana Priya

Ads

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా డెవిల్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి అనుకున్నంత మంచి స్పందన రాలేదు. కథ బానే ఉన్నా కూడా టేకింగ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా బాగుండేది ఏమో అని కామెంట్స్ వచ్చాయి.

Video Advertisement

మొదటి రోజు ఓపెనింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. ఈ సినిమాకి మొత్తంగా 20.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం 20.7 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. మొదటివారం పూర్తి అయ్యేసరికి ఈ సినిమా 9.09 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించారు. విరూపాక్ష తర్వాత ఈ సినిమాలో మరొక మంచి పాత్ర సంయుక్తకి దొరికింది.

devil movie review

సినిమా కథపరంగా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. అంతే కాకుండా సెట్టింగ్స్ కూడా చాలా బాగా చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా చూస్తున్నంత సేపు కూడా అప్పటి కాలంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. అన్ని బాగున్నా కూడా టేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సినిమా రిజల్ట్ తారుమారు అయిపోయింది. ట్రైలర్ చూసినవాళ్లు సినిమా హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ సినిమాలో మాత్రం యాక్షన్ సీన్స్ తప్ప మిగిలినవి పెద్దగా హైలైట్ అవ్వలేదు. కానీ ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉంటుంది అని అన్నారు. మరి అందులో ఈ పార్ట్ లో జరిగిన తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఏమో. ఆ సినిమా కథ ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే.


End of Article

You may also like