నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఆ నితిన్ సినిమా ఏంటో తెలుసా.?

నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఆ నితిన్ సినిమా ఏంటో తెలుసా.?

by Mounika Singaluri

Ads

దసరా సినిమా హిట్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు హాయ్ నాన్న అంటూ డిసెంబర్ 7న మన ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు నాని. ఈ సందర్భంగా నాని ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరియర్ స్టార్టింగ్ లో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తాను కెరీర్ ని స్టార్ట్ చేశానని, స్టార్ డైరెక్టర్ బాపు, రాఘవేంద్రరావు దగ్గర ఓనమాలు నేర్చుకున్నాను.

Video Advertisement

hi nanna movie review

రాఘవేంద్రరావు గారు డైరెక్షన్లో నితిన్ “అల్లరి బుల్లోడు” సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. ఆ మూవీ షూటింగ్ టైంలో నేను, నితిన్ ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళం. నితిన్ నాతో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడేవాడు. అయితే అప్పట్లో హీరోలని బాబు అని పిలిచే అలవాటు ఉండేదని కానీ తాను నితిన్ ని  పేరు పెట్టి పిలిచేవాడినని, అలా పిలవటం చాలామంది నేరంగా చూసేవారు.

కానీ నితిన్ మాత్రం తనని పేరు పెట్టి పిలిపించుకోవడానికి ఇష్టపడేవాడు. నితిన్ పేరు పెట్టి పిలిచినందుకు ఆ సినిమా ప్రొడ్యూసర్ తనని మందలించాడని, బాబు అని పిలవమని చెప్పాడని చెప్పుకొచ్చాడు నాని. కానీ నితిన్ మాత్రం తనని పేరు పెట్టి పిలిస్తేనే ఇష్టపడేవాడని, నితిన్ అని పిలవకూడదు అనుకుంటే ముద్దుగా నిత్ అని పిలువు అని చెప్పాడంట నితిన్.

అదే అసిస్టెంట్ డైరెక్టర్ నాని ఇప్పుడు స్టార్ హీరోగా మారి హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. డిసెంబర్ 7వ తారీఖున ఆయన హాయ్ నాన్న సినిమాతో నాని మనం ముందుకి వస్తే, డిసెంబర్ 8వ తారీఖున ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో నితిన్ మన ముందుకి వస్తున్నాడు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.


End of Article

You may also like