NANI: స్టార్ హీరోలకు లేని గట్స్ నానికి మాత్రమే.. ఈ విషయంలో నాని సూపర్!

NANI: స్టార్ హీరోలకు లేని గట్స్ నానికి మాత్రమే.. ఈ విషయంలో నాని సూపర్!

by Mounika Singaluri

Ads

నాచురల్ స్టార్ నాని ఈమధ్య నక్క తోకను తొక్కినట్లుగా ఉన్నాడు. తీసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అందుకుంటూ వరుస సక్సెస్ లు సాధిస్తున్నాడు. అటు హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా మంచి సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు నాని. అయితే నాని ఒక విషయంలో స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టేస్తున్నాడు.

Video Advertisement

సాధారణంగా స్టార్ రేంజ్ వచ్చిన తర్వాత చాలామంది కొత్త దర్శకులకి అవకాశాలు ఇవ్వటానికి సంకోచిస్తారు. ఎక్కడ వచ్చిన స్టార్ డం మిస్ అవుతుందో అని వారి భయం. కానీ నానీ మాత్రం కొత్త దర్శకులతో పనిచేయటానికి ఇష్టపడతాడు. ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల అతను చాలా మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈ రికార్డు స్టార్ హీరోలకు సైతం లేకపోవడం గమనార్హం. కెరియర్ మొదట్లో నాని నటించిన సినిమా అలా మొదలైంది.

hi nanna movie review

నందిని రెడ్డి ఈ సినిమాతోనే దర్శకురాలుగా పరిచయం అయింది. ఆ తరువాత వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా డైరెక్టర్ నాగ అశ్విన్ కూడా ఆ సినిమా ద్వారానే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన నిన్ను కోరి సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ కి ఆ సినిమా మొట్టమొదటిది. అలాగే ఈ మధ్యనే రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతోనే డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.

ఈ మధ్యనే వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న హాయ్ నాన్న సినిమా కూడా నూతన దర్శకుడు శౌర్యవ్ తో తీశాడు నాని. ఏ స్టార్ హీరోకి కూడా ఇంతమంది డైరెక్టర్లని పరిచయం చేసిన రికార్డు లేదు. నాని కొత్త డైరెక్టర్ లని ఎంకరేజ్ చేయడంలోనే కాదు నిర్మాతగా మారి కొత్త డైరెక్టర్ల ను ఎంకరేజ్ చేయడంలో కూడా ముందంజలో ఉంటాడు. అ.. ఆ, హిట్, హిట్ 2 సినిమాలకు నిర్మాతగా చేసి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు.


End of Article

You may also like