ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్ తో జతకట్టనున్న నాని… పాన్ ఇండియా మూవీ అంట..!

ఆ తమిళ్ స్టార్ డైరెక్టర్ తో జతకట్టనున్న నాని… పాన్ ఇండియా మూవీ అంట..!

by Mounika Singaluri

Ads

నాచురల్ స్టార్ నాని సంవత్సరానికి కనీసం రెండు సినిమాలైనా విడుదల చేస్తూ ఉంటారు. మిగతా హీరోలతో పోటీ లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకుని కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ హిట్స్ సొంతం చేసుకుంటూ ఉంటారు.

Video Advertisement

నాని ఇప్పటివరకు చాలామంది దర్శకులతో పని చేశారు.అందులో చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. తాజాగా హాయ్ నాన్న చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నారు. అయితే తన తర్వాత చిత్రాన్ని డాన్ మూవీ డైరెక్టర్ సి బి చక్రవర్తితో చేయనున్నారు. ఇది కాకుండా నానికి మాస్ హిట్ ఇచ్చిన దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ తో మరో మూవీ చేయనున్నారు.

nani

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక కొత్త న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏంటంటే తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు నానితో ఒక సినిమా చేయనున్నారనే వార్త వినిపిస్తుంది. కార్తీక్ సుబ్బరాజు టాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన మేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఎప్పటినుండో తెలుగు సినిమా చేయాలని చూస్తున్నారు. తాజాగా నానికి కథ చెప్పడం ఆయన ఓకే చేయడం జరిగిందట. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనుంది అనే టాక్ కనిపిస్తుంది. దీనిపై పూర్తి వివరాలు రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.


End of Article

You may also like