నాని, సుధీర్ బాబు మల్టీస్టారర్ ఓటీటీ రిలీజ్ “V” హిట్టా? ఫట్టా? స్టోరీ, రివ్యూ, రేటింగ్.!

నాని, సుధీర్ బాబు మల్టీస్టారర్ ఓటీటీ రిలీజ్ “V” హిట్టా? ఫట్టా? స్టోరీ, రివ్యూ, రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : వి (v)
  • నటీనటులు : నాని, సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నివేత థామస్.
  • నిర్మాత : దిల్ రాజు
  • దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ
  • సంగీతం : అమిత్ త్రివేది
  • విడుదల తేదీ : సెప్టెంబర్ 5, 2020 (అమెజాన్ ప్రైమ్)
Nani 'V' Movie Review

Nani ‘V’ Movie Review

కథ : 

Video Advertisement

ఈ సినిమా కథ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఒక్క పాయింట్ రివీల్ చేసినా కూడా సస్పెన్స్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. బ్రీఫ్ గా చెప్పాలంటే డిసిపి ఆదిత్య (సుధీర్ బాబు) ఒక సక్సెస్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఒక క్రైమ్ థ్రిల్లర్ కథ రాయడానికి అపూర్వ (నివేత థామస్) ఆదిత్య ని కలిసి, తనని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది.

ఇంతలో ఒక హత్య జరుగుతుంది, ఆ హత్య చేసిన క్రిమినల్ (నాని) ఆదిత్య కి ఫోన్ చేసి తాను ఇంకా కొన్ని హత్యలు చేయబోతున్నాను అని, అలాగే ఆ హత్యలకు సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇస్తాను అని చెప్తాడు. ఆదిత్య ఆ క్రిమినల్ ని పట్టుకున్నాడా? అసలు ఆ క్రిమినల్ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? ఆదిత్య కి ఆ క్రిమినల్ కి ఏమైనా సంబంధం ఉందా? అసలు వి అంటే అర్థం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

Nani 'V' Movie Review

Nani ‘V’ Movie Review

విశ్లేషణ : 

ఈ సినిమా అందరూ నటీనటులకు కచ్చితంగా ముఖ్యమైన సినిమా. కానీ నాని కి మాత్రం ఈ సినిమా ముఖ్యమైనది మాత్రమే కాకుండా, తన సినిమా జర్నీలో ఒక ల్యాండ్ మార్క్ సినిమా. ఏ యాక్టర్ కి అయినా కూడా ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే ఇలాంటి ల్యాండ్ మార్క్ సినిమాలు మాత్రం కొంచెం స్పెషల్ గా ఉంటాయి. అలాంటి స్పెషల్ సినిమా లో ఒక డిఫరెంట్ పాత్రను పోషించి ఈ సినిమా ఇంకా గుర్తుండిపోయేలా చేశారు నాని.

మిగిలిన ముఖ్య నటులకి ఇంపార్టెన్స్ ఇస్తూనే కథ మొత్తం నాని పాత్ర చుట్టూ తిరుగుతుంది. మనం ఒక్కసారి అన్ని సినిమాలను గమనిస్తే కథ కొత్తగా ఉండటం అనేది చాలా వరకు కష్టమే. కొత్తదనం అనేది కథనంలో, స్క్రీన్ ప్లే లో ఉంటుంది. ఈ సినిమాలో కూడా కథ మొత్తం కాకపోయినా కూడా కొంతవరకు మనం ఎక్కడో చూసే ఉంటాం.

కానీ సినిమా చూస్తున్నంత సేపు ఒక ప్రేక్షకుడు డైవర్ట్ అవ్వకుండా, సినిమా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ గా ఉండేలా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ కచ్చితంగా సక్సెస్ అయ్యారు. ఆ సస్పెన్స్ అనేది దాదాపు సినిమా చివరి వరకు మెయింటెన్ అవుతుంది. సినిమా అయిపోయింది అనుకునే సమయానికి కథ ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది.

Nani 'V' Movie Review

Nani ‘V’ Movie Review

ఇంక ఇప్పుడు నటీనటుల నటన విషయానికొస్తే టీజర్ చూసినప్పటి నుంచి, కాదు. సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఎక్కువ మంది ఎదురు చూసింది నాని కోసమే. కాబట్టి ప్రేక్షకులు ఏమి ఎక్స్పెక్ట్ చేశారో నాని కూడా అదే విధంగా నటించారు. ఇప్పటివరకు నాని ఇలాంటి పాత్ర పోషించలేదు అనే చెప్పాలి. నటుడిగా నాని కచ్చితంగా మరో మెట్టు ఎక్కారు.

నాని తర్వాత ఈ సినిమాలో అంతగా మాట్లాడుకునే వ్యక్తి సుధీర్ బాబు. డిసిపి ఆదిత్య పాత్ర కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు సుధీర్ బాబు. ఫైటింగ్స్ లోనే కాకుండా నటనలో కూడా తనదైన శైలితో అందరిని అలరించారు. నాని, సుధీర్ బాబు తమదైన నటనతో మెప్పించారు. నివేత థామస్, అదితి రావు హైదరి కూడా వాళ్ల పాత్రల్లో బాగా నటించారు.

వెన్నెల కిషోర్, రాజా చెంబోలు, హరీష్ ఉత్తమన్, నరేష్, రోహిణి, తనికెళ్ల భరణి, తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకి నటీనటుల యాక్షన్ తర్వాత పి.జి.విందా సినిమాటోగ్రఫీ మేజర్ ప్లస్ పాయింట్ అయింది.

ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వాతావరణాన్ని అంతే బాగా క్యాప్చర్ చేయడానికి కలర్ గ్రేడింగ్ బాగా ఉపయోగపడింది. అమిత్ త్రివేది అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. కాబట్టి పాటలు బాగున్నాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకొక ప్లస్ పాయింట్ ఎస్.ఎస్ తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తే “అరే! ఈ సినిమా థియేటర్లో చూస్తే ఇంకా బాగుండేది” అని అనిపిస్తుంది.

Nani 'V' Movie Review

Nani ‘V’ Movie Review

ప్లస్ పాయింట్స్ :

  • నాని, సుధీర్ బాబు, ఇంకా మిగిలిన నటీనటుల యాక్టింగ్
  • బ్యాగ్రౌండ్ స్కోర్
  • సినిమాటోగ్రఫీ
  • గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్ :

  • కొన్ని తెలిసిపోయే ట్విస్టులు
  • అక్కడక్కడా కొంచెం డల్ అయినట్టు అనిపించే సన్నివేశాలు

రేటింగ్ : 3.5/5

ట్యాగ్ లైన్ :

కచ్చితంగా ఒక్కసారైనా థియేటర్ లో చూడాల్సిన సినిమా. సినిమాలో చాలా సన్నివేశాలు ఇంటర్ లింకింగ్ ఉంటాయి. కాబట్టి కథ ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా సినిమా చూస్తే బెటర్. పైన చెప్పినట్లు మనకి తెలిసిన కథే అయినా కూడా ప్రజెంటేషన్ బాగుండడంతో, ఇంకా సినిమాలో నెగిటివ్స్ కన్నా కూడా పాజిటివ్స్ ఎక్కువగా ఉండడంతో ఒక సగటు ప్రేక్షకుడు డిసప్పాయింట్ అయితే అవ్వరు. కాబట్టి మీరు కూడా ఈ సినిమా మిస్ అవకుండా చూడండి.


End of Article

You may also like