Ads
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా చాలా మంది నిర్మాతలు తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నారు. కొంత మంది ఏమో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే పెద్ద హీరోల సినిమాలు కూడా డిజిటల్ రిలీజ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు స్టార్ హీరోల డిజిటల్ రిలీజ్ జాబితాలో మరో సినిమా కూడా చేరబోతోంది.
Video Advertisement
నాని హీరోగా నటించిన శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన టక్ జగదీష్ సినిమా డిజిటల్ రిలీజ్ అవుతుంది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ వైపు వెళ్లబోతోంది అని సమాచారం. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా బృందానికి 45 కోట్లు చెల్లించిందట. ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే ఇటీవల సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, నాని, సినిమా థియేటర్లు ఓపెన్ చేయాలి అని, అలాగే సినిమాలు అన్ని థియేటర్లలో విడుదల అవ్వాలి అని, ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కి మించిన సినిమా ఎక్స్పీరియన్స్ మరేదీ ఉండదు అని అన్నారు. కానీ ఇప్పుడు నాని సినిమా టక్ జగదీష్ డిజిటల్ రిలీజ్ బాటలో వెళ్లడంతో సోషల్ మీడియా అంతా, “అంతకు ముందు అన్నారు కదా? మరి ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి?” అని అంటున్నారు.
watch video:
End of Article