PRATHINIDHI 2 REVIEW : చాలా సంవత్సరాల తర్వాత “నారా రోహిత్” హీరోగా నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

PRATHINIDHI 2 REVIEW : చాలా సంవత్సరాల తర్వాత “నారా రోహిత్” హీరోగా నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Harika

Ads

సినిమాకి సినిమాకి సంబంధం లేకుండా, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేస్తున్న హీరోల్లో, మొదటిగా గుర్తొచ్చే హీరో నారా రోహిత్. నారా రోహిత్ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా సబ్జెక్ట్ మాత్రమే ముఖ్యంగా భావిస్తారు. నారా రోహిత్ గత కొంత కాలం నుండి సినిమాల నుండి బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రతినిధి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : ప్రతినిధి 2
  • నటీనటులు : నారా రోహిత్, సిరి లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా.
  • నిర్మాత : కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట మరియు సురేంద్రనాథ్ బొల్లినేని
  • దర్శకత్వం : మూర్తి దేవగుప్తపు
  • సంగీతం : మహతి స్వర సాగర్
  • విడుదల తేదీ : మే 10, 2024

prathinidhi 2 review

స్టోరీ :

చేతన్ (నారా రోహిత్) ఒక పాత్రికేయుడు. ఒక ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా చేస్తూ ఉంటాడు. ఎన్.ఎన్.సి అనే ఒక ఛానల్ చేతన్ పనికి మెచ్చి అతనిని తమ ఛానల్ లో చేర్చుకుంటుంది. ఇందులో ఎన్నో విషయాల గురించి చేతన్ బయట పెడతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడేకర్) చనిపోవడంతో, ఆయన కొడుకు (దినేష్ తేజ్) ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలి అని అనుకుంటాడు. కానీ ఆ ప్రయత్నానికి చేతన్ అడ్డుగా నిలుస్తాడు. అసలు చేతన్ అలా ఎందుకు చేశాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా చనిపోయారు? ఈ విషయాలన్నీ చేతన్ ఎలా బయట పెడతాడు? చేతన్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

చాలా సంవత్సరాల క్రితం నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా ఇలాంటి ఒక సీరియస్ అంశం మీద సాగుతుంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా కథ కొత్తగా ఉంటుంది. సినిమా అంతా కూడా సీరియస్ విషయం మీద సాగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేయడం నారా రోహిత్ కి కొత్త ఏమీ కాదు. నారా రోహిత్ తెర మీద కనిపించి చాలా సంవత్సరాలు అయినా కూడా ఆ తేడాని తెలియనివ్వలేదు. కొన్ని కమర్షియల్ అంశాలు కూడా యాడ్ చేసి ఈ సినిమాని ఒక పొలిటికల్ డ్రామా లాగా చూపించారు. జర్నలిజంని గొప్పగా చూపించడానికి ప్రయత్నించారు.

చాలా సీన్స్ లోతుగా రాసుకున్నారు. ఇంక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే, సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాని సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మహతి స్వర సాగర్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో సెకండ్ హాఫ్ లో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. కానీ, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మాత్రం సాగదీసినట్టు అనిపిస్తాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • స్టోరీ పాయింట్
  • డైలాగ్స్
  • నటీనటుల ఎంపిక
  • కొన్ని ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్
  • సాగదీసినట్టుగా అనిపించే కొన్ని సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

పొలిటికల్ డ్రామాలని ఇష్టపడే వారిని ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పొలిటికల్ డ్రామా సినిమాలు రావడం చాలా తక్కువ. ఇటీవల కాలంలో వచ్చిన ఒక మంచి పొలిటికల్ డ్రామాగా ప్రతినిధి 2 సినిమా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like