అయోధ్య రాముడి కోసం… నరేంద్ర మోడీ పాటిస్తున్న ఈ కఠిన నియమాలు ఏంటో తెలుసా..?

అయోధ్య రాముడి కోసం… నరేంద్ర మోడీ పాటిస్తున్న ఈ కఠిన నియమాలు ఏంటో తెలుసా..?

by kavitha

అయోధ్యలోని రామమందిరంలో కొలువుదీరనున్న శ్రీ రాముడిని చూడడం కోసం ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జనవరి 22న జరుగనున్న రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట సమయంలో రామమందిర గర్భగుడిలో ఐదుగురు మాత్రమే ఉంటారు.

Video Advertisement

అయోధ్య మందిర ప్రారంభోత్సవం ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జరుగనుంది. ఆయనతో పాటు మరో నలుగురు ప్రాణప్రతిష్ట వేళ గర్భగుడిలో ఉండనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కఠిన దీక్ష చేస్తున్నారని  తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అయోధ్యలో జనవరి 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పీఎం మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే. ఆయన చేతుల మీదుగా అయోధ్య రామమందిర గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది. ఈ క్రమంలోనే జనవరి 12న అనుష్ఠాన కార్యక్రమాన్నిమొదలుపెట్టారు. అప్పుడే 11 రోజుల పాటు అనుష్ఠాన దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు నుండి ప్రధాని నరేంద్ర మోదీ కఠిన దీక్ష చేస్తున్నారు.
ఈ దీక్షలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నారు. ప్రధాని మోదీ ఆహారం తీసుకోకుండా కొబ్బరి నీళ్లను మాత్రమే తీసుకుంటూ, నేలపై నిద్రపోతున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ఈ దీక్షలో భాగంగా ఎనిమిదవ రోజు సైతం ఆహారం తినకుండా  కొబ్బరి నీళ్ళు మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించాయి. మోదీ ఈ దీక్షలో భాగంగా కఠినమైన నియమాలు, వ్యాయామాన్ని పాటిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రధాని మోదీ కఠిన దీక్షలో ఉన్నా, పర్యటనలు విస్తృతంగా చేస్తూనే ఉన్నారు. గత వారంలో కేరళ, ఆంధ్రప్రదేశ్,  మహారాష్ట్రలో పర్యటించి, పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. శంకుస్థాపనలు చేశారు. అంతే కాకుండా ఆ రాష్ట్రాలకు వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న పలు దేవాలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలను కూడా నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రతినిధిగా తనను ఆ అయోధ్య రాముడు ఎంపిక చేసుకున్నాడని ప్రధాని చెప్పుకొచ్చారు.

Also Read: అయోధ్య రామ మందిరానికి ప్రసాదం తయారు చేసే ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?


You may also like

Leave a Comment