Ads
ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
Video Advertisement
ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. జబర్దస్త్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన కమెడియన్స్ లో ఒకరు నరేష్. గత కొంత కాలం నుండి తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నరేష్. నరేష్ జబర్దస్త్ లో మాత్రమే కాకుండా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ ఉంటారు.
అయితే ఇటీవల జబర్దస్త్ లోకి అడుగు పెట్టిన కొత్త అమ్మాయి షబీనాతో నరేష్ లవ్ ట్రాక్ నడిపేందుకు ప్రయత్నించారు. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. అంటే కెవ్వు కార్తీక్ స్కిట్ లో నరేష్ చేశారు. అందులోనే షబీనా కూడా నటించారు. అయితే నరేష్ లవర్ కార్తీక్ దగ్గరికి వెళ్తారు, కార్తీక్ లవర్ నరేష్ దగ్గరికి వస్తారు. ఇలా నడిచిన ఈ స్కిట్ ప్రేక్షకులను అలరించింది. జడ్జెస్ కూడా అభినందించారు. నరేష్ టెలివిజన్ లో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం జబర్దస్త్ షో షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు నరేష్.
End of Article