ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. పూజా హెగ్డే వ్యవహరించే తీరుపై ఇటీవల రోజా భర్త, దర్శకుడు అయిన సెల్వమణి మాట్లాడిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయం నిర్మాత నట్టి కుమార్ కూడా ప్రస్తావించారు. ఇటీవల చిరంజీవి ఇంట్లో జరిగిన మీటింగ్ గురించి నట్టి కుమార్ మాట్లాడారు. అసలు అది వ్యక్తిగత మీటింగా? లేదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మీటింగా? అర్థం కాలేదు అని అన్నారు.

అంతే కాకుండా థియేటర్ రెంట్స్, హీరోయిన్ రెమ్యూనరేషన్ల విషయంపై కూడా మండిపడ్డారు. ఇటీవల వచ్చిన హీరోయిన్లు 4-5 కోట్లు తీసుకుంటున్నారు. అంతకుముందు సౌందర్య గారికి 35-40 లక్షల రెమ్యునరేషన్ ఉండేది. ఇప్పటి హీరోయిన్లకు నలుగురు బాడీగార్డులు, ఒక కారు, వ్యానిటీ వ్యాన్ అన్ని ఉంటున్నాయి. ఇది ప్రజల డబ్బు అని అన్నారు. ఈ విధానంలో మార్పు రావాలి అని కూడా అన్నారు నట్టి కుమార్. అయితే, నట్టి కుమార్ ఉద్దేశించి మాట్లాడిన హీరోయిన్ పూజా హెగ్డే అని సమాచారం.

watch video :