నాచురల్ స్టార్ నానిని ఫోటో అడిగితే అలా చేస్తారనుకోలేదు.. నటి సెన్సేషనల్ కామెంట్స్..!!

నాచురల్ స్టార్ నానిని ఫోటో అడిగితే అలా చేస్తారనుకోలేదు.. నటి సెన్సేషనల్ కామెంట్స్..!!

by Sunku Sravan

Ads

హీరో నాని ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసి పాత్రకే వన్నె తెచ్చే హీరో నాని.. ఆయన ఏం చేసినా న్యాచురల్ గానే ఉంటుంది. అందుకే ఆయనను న్యాచురల్ స్టార్ అని అంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఏ సినిమా తీసినా సింపుల్ గా న్యాచురల్ గా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఆయన ఎన్నో సినిమాల్లో నటించి విజయపరంపర కొనసాగిస్తున్నారు. ఇటీవలనే శ్యామ్ సింగరాయ అయితే సూపర్ డూపర్ హిట్ కొట్టి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ప్రముఖ టాలీవుడ్ నటి విజయ దుర్గ హీరో నానిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.. అవేంటో చూద్దాం..!!

Video Advertisement

 

విజయదుర్గ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివాహం అయిన తర్వాత తన భర్తతో గొడవలు జరిగాయని అన్నారు. నా భర్తకు ఆటిట్యూడ్ ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. ఆయన ఆటిట్యూడ్ వల్లనే గొడవలు జరిగాయని దుర్గా చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆమె తెలియజేశారు. తాను సీరియల్స్ లో నటించడం వల్ల తేజ గారి తర్వాత మూవీస్ లో అవకాశాలు రాలేదని అనుకుంటున్నాం అని తెలిపారు.  తను సంవత్సరానికి ఒకసారి తేజ గారికి కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పుకొచ్చారు. తేజ సార్ సినిమాల్లో నాకు గాడ్ఫాదర్ అని అన్నారు. తేజ గారు నన్ను హీరోయిన్ అని పిలుస్తారని చెప్పారు.

అమ్మ నాన్న చనిపోయిన తర్వాత బాగా ఏడ్చాను అని ఉన్నారు.. షూటింగ్ సమయంలో ఎక్కువ టెక్ తీసుకొని మేనేజర్ సార్ తో ఒకసారి తిట్లు కూడా తిన్నానని తెలియజేశారు. నా షార్ట్ వాళ్లనే షూటింగ్ కూడా లేట్ అవ్వడంతో మేనేజర్ గారు తిట్టాడు అని చెప్పింది. ప్రస్తుతం నాని గారితో చేస్తున్నానని, ఓసారి నాని గారినీ ఫోటో కావాలని అడగగా మనకు షూటింగ్ సమయం ఇంకా ఉంది కదా దిగుదాం లే అని అన్నారు అని, ప్రస్తుతం గెటప్ బయటకు రాకూడదని ఫోటో దిగలేదని తెలియజేశారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ చాలా క్యూట్ గా ముద్దు గా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సోనూసూద్ చిరంజీవి పెద్ద నటులతో సినిమా చేయాలని ఉందని తెలియజేశారు.


End of Article

You may also like