HIT 2: ఆ భయంతోనే సినిమాలు చేయ‌టం లేదు.. హీరో ”నాని” కామెంట్స్!

HIT 2: ఆ భయంతోనే సినిమాలు చేయ‌టం లేదు.. హీరో ”నాని” కామెంట్స్!

by kavitha

HIT 2: శైలేష్ కొలను డైరెక్షన్ లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా ‘హిట్ 2’. ఇందులో అడివి శేష్,హీరోయిన్ మీనాక్షి చౌదరి జంటగా నటించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని ది వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ పై ఈ మూవీని నిర్మించారు. ఈ నెల 2న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.

Video Advertisement

ప్రస్తుతం సినీ ఇండ‌స్ట్రీ రొటీన్‌కు భిన్నంగా వెళ్తోంది. ఒక్క క‌మ‌ర్షియ‌ల్ అంశాలే ముఖ్యం కాదు. కంటెంట్ కూడా కీలకమేనని ప్రేక్షకులు అంటున్నారు. కంటెంట్ ఉన్న సినిమాల‌ను స‌క్సెస్ చేసి చూపిస్తున్నారు. దీనితో డైరెక్టర్స్, నిర్మాత‌లు రొటీన్ చిత్రాలను కాకుండా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో హిట్స్ అందుకుంటున్నారు. అలా రీసెంట్ గా వచ్చిన సినిమా హిట్ 2. అడివి శేష్ నటించిన ఈ సినిమాకు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.nani-hit-2-1telugu-addaహీరో నాని హిట్ 2 సినిమాకు హిట్ టాక్ వచ్చిన సందర్భంగా ఈ మూవీ గురించి మాట్లాడారు. నాని ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. హిట్ 2 జర్నీలో మూవీ యూనిట్ గురించి మాట్లాడుతూ ‘వాల్ పోస్ట‌ర్ సినిమా మొదలు పెట్టి, కొత్త ఐడియాలతో న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించాలని అనుకున్నాను. రొటీన్ సినిమాలు చేయకూడ‌ద‌నే ఈ వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ ని ప్రారంభించాను. డిఫ‌రెంట్ గా ఉండే సినిమాల‌ను చేస్తే ఎవరు చూడ‌రు. అసలు ఇది వ‌ర్క‌వుట్ అవుతుందా? అని చాలా మంది నన్ను భ‌య‌పెట్టారు.nani-hit-2-2telugu-addaఅయితే తెలుగు ఆడియెన్స్ డిఫ‌రెంట్ మూవీస్ చూస్తార‌నే ధైర్యం, నమ్మకం ఉంది. ఇప్పడది ఇంకోసారి హిట్ 2 తో రుజువైంది’ అన్నారు. హీరో నాని సమర్పకుడిగా, ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాత‌గా మరి వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌ను మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్‌లో తీసిన మొదటి సినిమా అ!. ఈ సినిమాతో ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా మారారు. ఆ తరువాత శైలేష్ కొల‌నుని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ హిట్ యూనివ‌ర్స్ మొదలుపెట్టారు.


You may also like

Leave a Comment